Jagtial Road Accident: జగిత్యాల జిల్లా(Jagtial District)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)చోటుచేసుకుంది.ఆర్టీసీ బస్సు-కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం కోరుట్ల మండలం మోహన్ రావుపేట వద్ద జరిగింది. క్షతగాత్రులను కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే..


కోరుట్లలోని బిలాల్‌పుర ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం హైదరాబాద్‌(Hyderabad)కు వెళ్లి కారులో తిరుగు పయనమ్యారు. కోరుట్ల(Korutla)10 కిలోమీటర్ల దూరంలో ఉందనగా ఆర్టీసీ బస్సు- కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారు డ్రైవర్‌ సాజిద్‌ అలీ(45), ఓ చిన్నారి అక్కడికక్కడే మృతిచెందగా...మరో చిన్నారిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు(Police)...ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook