Rythu Bandhu In Telangana: తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు ఆర్థిక చేయూత అందించడంలో భాగంగా రైతుబంధు పథకం ప్రవేశపెట్టింది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలతో గత వారం రోజులుగా రైతు బంధు నగదు పంపిణీ జరుగుతోంది. వర్షాకాలం (ఖరీఫ్) దఫా రైతు బంధు నగదు జూన్ 15న ప్రారంభమైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఏడాదికిగానూ టీఆర్ఎస్ ప్రభుత్వం 63.25 లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించింది. గత ఏడాదితో పోల్చితే 2,81,865 మంది కొత్త రైతులను లబ్దిదారుల జాబితాలో చేర్చింది. రైతు బంధు నగదు పంపిణీ జూన్ 25 వరకు కొనసాగనుండగా, నేడు 30 ఎకరాల భూమి ఉన్న రైతులకు రైతుబంధు నగదు బ్యాంకు ఖాతాల్లోకి జమ కానుంది. ఆ మేరకు భూమి ఉన్న రైతులు 17,776 మంది ఖాతాలల్లో నేడు రూ. 120.16 కోట్లు అన్నదాతలకు పెట్టుబడి సాయం (Rythu Bandhu Scheme) జమ కానుంది. తెలంగాణలో రూ.7,298 కోట్ల మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.


Also Read: Rythu Bandhu Scheme: నేటి నుంచి పది రోజుల వరకు రైతుబంధు సాయం, ఖాతాల్లోకి రూ.5 వేలు


జూన్ 15న రైతు బంధు పథకం ఈ ఖరీఫ్ విడత రూ.5 వేలు పంపిణీ మొదలైంది. తొలిరోజు ఒక ఎకరం ఉన్న రైతుల ఖాతాల్లో నగదు సాయం జమ చేయగా, ఆపై 3, 5 ఎకరాలు, 10, 15, 20 మరియు 25 ఎకరాల వారీగా రైతుబంధు సాయం పంపిణీ జరుగుతోంది. నేడు 30 ఎకరాల పట్టా భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోంది. ఈ సీజన్‌తో కలిపి ఇప్పటి వరకు ఏడు దఫాలుగా రైతులకు Rythu Bandhu పెట్టుబడి సాయం అందించారు.


Also Read: Rythu bandhu scheme money: పాత బకాయిల కింద రైతు బంధు సాయం.. స్పందించిన మంత్రి హరీష్ రావు, బ్యాంకులకు ఆదేశాలు 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook