Rythu bandhu scheme money | హైదరాబాద్: రైతు బంధు పథకం కింద రైతులకు అందించే పెట్టుబడి సాయం రాష్ట్రంలోని రైతులు అందరికి అందే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం అధికారులతో బిఆర్‌కెఆర్ భవన్‌లో ( BRKR Bhavan) రైతు బంధు పంపిణీపై సీఎస్ సోమేష్ కుమార్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ( CM KCR) అదేశాల మేరకు ఎటువంటి జాప్యం లేకుండా రైతులందరికి వారి వారి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అయ్యేలా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

( TS high court: కరోనా పరీక్షలపై తెలంగాణ హై కోర్టు కీలక వ్యాఖ్యలు, సూచనలు )


ఈ కార్యక్రమంలో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి  కె.రామకృష్ణా రావు , వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఆర్ధిక శాఖ కార్యదర్శి  రోనాల్డ్ రోస్, భూ పరిపాలన శాఖ డైరెక్టర్ రజత్ కుమార్ షైనీ, యం.డి. టి.ఎస్.టి.ఎస్ వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..