Sabitha Indra Reddy Tears: అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మనస్తాపం చెందారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో సబిత మనస్తాపానికి గురయ్యారు. అసెంబ్లీ వాయిదా అనంతరం నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో సబితమ్మ కంటతడి పెట్టారు. మాట్లాడుతున్న సమయంలో భావోద్వేగానికి గురయి ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
Also Read: Chiranjeevi: రేవంత్‌ రెడ్డి బాధపై చిరంజీవి స్పందన.. గద్దర్‌ అవార్డులపై మెగాస్టార్‌ ప్లాన్‌ ఇదే!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసెంబ్లీ సమావేశాల్లో ద్రవ్య వినిమయ బిల్లుపై బుధవారం జరిగిన చర్చలో బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. ఈ క్రమంలో కల్పించుకుని రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. 'అక్కలు ఇక్కడ వాళ్లను ముంచే అక్కడ తేలారు. మీ వెనుకాల ఉన్న అక్కలను నమ్మి మోసపోవద్దు' అని రేవంత్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'వారిని నమ్మితే జూబ్లీ బస్టాండే' అని కేటీఆర్‌కు చెప్పడంతో అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో గందరగోళం ఏర్పడింది.

Aslo Read: Telangana Assembly: అసెంబ్లీలో ఆసక్తికర చర్చ.. రేవంత్ రెడ్డి సీటుకు ఎసరు పెట్టిన కోమటిరెడ్డి


సబిత లక్ష్యంగా అసభ్య వ్యాఖ్యలు
ఈ క్రమంలో సబితమ్మను లక్ష్యంగా చేసుకుని రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క తీవ్ర ఆవేశంలో మాట్లాడారు. భట్టి విక్రమార్క మరింత రెచ్చిపోయి 'ఏ ముఖం పట్టుకుని మాట్లాడుతున్నారు' అని సబితపై విరుచుకుపడ్డారు. 'గుండె మీద చేయి వేసుకొని సీఎం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి ఆహ్వానించి.. ఆశీర్వదించను.. నా మీద కక్ష తీర్చుకుంటున్నారు. మీకు మంచి భవిష్యత్ ఉంటుంది అని చెప్పాను. మేము ఎవరిని ముంచలేదు' అని రేవంత్‌ రెడ్డిపై సబిత నిప్పులు చెరిగారు.


అసెంబ్లీలో నిరసన
అసెంబ్లీలో ఒక మహిళా సభ్యురాలు.. సీనియర్‌ నాయకురాలైన సబిత ఇంద్రారెడ్డిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రేవంత్‌ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పారని సబితా ఇంద్రారెడ్డి పట్టుబట్టారు. సభ బయట, లోపల రేవంత్‌ తీరుపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలంతా కలిసి అసెంబ్లీ ఆవరణలో నిరసన చేపట్టారు. రేవంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ సబితమ్మ కంటతడి పెట్టారు. భావోద్వేగానికి లోనయి మాట్లాడకుండా అర్ధంతరంగా వెనక్కి వెళ్లారు. అనంతరం మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడారు. వెంటనే రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రోజు బ్లాక్ డేగా ఆమె ప్రకటించారు.

మా ఖర్మ కాలి అసెంబ్లీకి వచ్చాం
'‌అసెంబ్లీ నుంచి దొంగలా రేవంత్ పారిపోయారు. భట్టి మాటలు బాధాకరం. భట్టి మీ పక్క సీటు ఎందుకు. మా ఖర్మ కాలి అసెంబ్లీకి వచ్చాం' అంటూ సబితా కంటి తడి పెట్టుకున్నారు. 'మేం ఏ తప్పు చేయలేదు. పార్టీ మారారని మీకు అనే హక్కు లేదు. మేము పార్టీ మారలేదు.. పార్టీ నుంచి బయటకు మెడ పట్టి గెంటేశారు. మా కుటుంబానికి ఓ చరిత్ర ఉంది. 2014లో టికెట్ ఇవ్వకపోయినా నేను పార్టీకి పనిచేశాను. రాజకీయాల్లో రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చారు. మహిళలను మహానేత రాజశేఖర్ రెడ్డి ప్రోత్సహించారు' అని తెలిపారు. 


కౌరవ సభలో ద్రౌపదిలా
'మహిళలను కనీసం మాట్లాడనివ్వడం లేదు. ముఖ్యమంత్రి సీటు రేవంత్ రెడ్డి సొంతం కాదు.. నాలుగు కోట్ల ప్రజలు ఇచ్చిన పదవి. పార్టీలో ఉన్నా.. నిబద్ధతతో పనిచేశాము. మమ్మల్ని అవమానించారంటే రాష్ట్ర మహిళలను అవమానించినట్లే. అధికారంలో ఉన్నా లేకున్నా జెండా మోసి కార్యకర్తలను కాపాడుకున్నాం. దొంగలే దొంగ అన్నట్లుగా ఉంది. డీకే అరుణ, సబితారెడ్డితో పాటు నన్ను అవమానించారు. కౌరవ సభలో ద్రౌపదిలా మమ్మల్ని అవమానించారు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter