హైదరాబాద్‌లో మూసాపేట్ హబీబ్ నగర్‌కు చెందిన యువతి దారుణ హత్యకు గురైంది. జానకి అనే యువతిని మంగళవారం రాత్రి ఓ దుండగుడు కత్తితో పొడిచి హత్యచేశాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన జానకి బ్రతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చింది. కూకట్‌పల్లిలోని డీమార్ట్‌లో పనిచేస్తున్న ఆమెను ఆనంద్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధించేవాడని మృతురాలి స్నేహితులు తెలిపారు. ప్రేమించకపోతే చంపేస్తానంటూ గతంలో చాలాసార్లు బెదిరించాడని... అతడే జానకిని హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఘటానా స్థలికి చేరుకొని పరిస్థితని సమీక్షించి... పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.