Jagga Reddy Dance: తెలంగాణ రాజకీయాల్లో సంథింగ్ స్పెషల్ సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఆయన ఏం చేసినా సెపరేటే.  పాలిటిక్స్ కు సంబంధించి హాట్ హాట్ కామెంట్లు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటారు జగ్గారెడ్డి. ప్రజా క్షేత్రంలోనూ ఆయన ఇతర నేతలకు భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటారు. తన నియోజకవర్గంలో విస్తృతంగా తిరిగే జగ్గారెడ్డి.. జనాలతో కలిసి సరదాగా గడుపుతుంటారు.  వినూత్నంగా కార్యక్రమాలు చేపడుతుంటారు. ఎమ్మెల్యేనన్న సంగతి మర్చిపోయి ప్రజలతో సామాన్యుడిగా కలిసిపోతుంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ పెళ్లి వేడుకకు హాజరైన ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. తీన్మార్ స్టెప్పులు వేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సంగారెడ్డి పట్టణంలో జరిగిన బెస్తే అశోక్ కుమార్ వివాహ వేడుకకు హాజరయ్యారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. వధూవరులను ఆశీర్వదించారు. తర్వాత కాసేపు అక్కడే ఉన్నారు. ఆ సమయంలోనే పెళ్లి మండపంలో డీజే పాటలకు యువతి, యువకులు డ్యాన్సులు చేస్తున్నారు. పెళ్లి కుమారుడు, పెళ్లి కూతురుని కూడా తమతో పాటు స్టెప్పులు వేయించారు వాళ్ల స్నేహితులు. దీంతో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. వధూవరుడితో కలిసి స్టెప్పులు వేశారు. డీజీ టిల్లు సాంగ్ వస్తుండగా.. తీన్మార్ స్టెప్పులు వేసి అదరగొట్టారు. యువతి,యువకులతో కలిసి కాసేపు చిందులు వేశారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి,


పెళ్లి వేడుకకు హాజరైన ప్రజలు ఎమ్మెల్యే జగ్గారెడ్డి డ్యాన్సు చేస్తుండగా ఆసక్తిగా చూశారు. మరికొందరు వచ్చి ఎమ్మెల్యేతో కలిసి స్టెప్పులు వేశారు. పెళ్లి వేడుకలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి డ్యాన్స్ చేసిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గతంలోనూ చాలా సందర్భాల్లో డ్యాన్సు చేశారు జగ్గారెడ్డి. పార్టీ కార్యక్రమాల్లోనూ ఆయన పలు సార్లు తీన్మార్ స్టెప్పులు వేశారు.


READ ALSO: Gautam Adani Rajyasabha: జగన్ కు భయపడే రాజ్యసభ సీటు వద్దన్నారా!  అదానీ ప్రకటనపై ఏపీలో రాజకీయ రచ్చ..  


READ ALSO: Prashanth Kishor Report: కేసీఆర్ చేతిలో లీడర్ల జాతకాలు.. సగం మందికి గండమే! టీఆర్ఎస్ లో పీకే టెన్షన్.. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook