హైదరాబాద్‌లో 'స్క్రబ్ టైఫస్' (Scrub Typhus) వ్యాధి తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే ఒమిక్రాన్ వ్యాప్తి ఆందోళన రేకెత్తిస్తుండగా... కొత్తగా 'స్క్రబ్ టైఫస్' వ్యాధి అలజడి రేపుతోంది. ఇటీవలి కాలంలో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో 15 మంది స్క్రబ్ టైఫస్ వ్యాధికి చికిత్స తీసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులే. స్క్రబ్ టైఫస్‌తో ఈ  నెలలో నలుగురు చిన్నారులు గాంధీ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. వీరిలో ఇద్దరు కోలుకుని డిశ్చార్జి అవగా... మరో ఇద్దరికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్క్రబ్ టైఫస్ అంటే... :


స్క్రబ్ టైఫస్‌నే (Scrub Typhus) బుష్ టైఫస్ అని కూడా పిలుస్తారు. ఇది ఒరియెంటియా సుసుగముషి ( Orientia tsutsugamushi) అనే బాక్టీరియా వల్ల సోకుతుంది. నల్లిలా ఉండే పురుగులు  (larval mites) కుట్టడం ద్వారా ఈ బాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. స్క్రబ్ టైఫస్ సోకినవారిలో జ్వరం, తలనొప్పి, ఒళ్లు  నొప్పులు, చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి. వ్యాధి తీవ్రమైనవారిలో తీవ్ర రక్తస్రావం, అవయవాలు పూర్తిగా దెబ్బతినడం జరగవచ్చు. అదే జరిగితే మరణానికి దారితీస్తుంది.


స్క్రబ్ టైఫస్ సోకినవారికి యాంటీబయాటిక్ డాక్సిసైక్లిన్ అందించాల్సి ఉంటుంది. వయసుతో నిమిత్తం లేకుండా అన్ని వయసుల వారికి డాక్సిసైక్లిన్ ఇవ్వొచ్చు. లక్షణాలు గుర్తించిన వెంటనే యాంటీబయాటిక్ డాక్సిసైక్లిన్ తీసుకోవడం ద్వారా త్వరగా వ్యాధి నయమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే ఈ వ్యాధికి ప్రత్యేక వ్యాక్సిన్ అందుబాటులో లేదు. భారత్‌తో (Omicron cases in India) పాటు ఇండోనేషియా, చైనా, జపాన్, నార్తర్న్ ఆస్ట్రేలియాల్లో ఈ వ్యాధికి సంబంధించిన కేసులు ఎక్కువగా నమోదువుతంటాయి.


Also Read: Gujarat: హతవిధి-ఆ సర్పంచ్ అభ్యర్థికి కేవలం ఒక్క ఓటు-కౌంటింగ్ కేంద్రం వద్దే కుప్పకూలిపోయాడు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook