Fire Accident: సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా తలెత్తిన ప్రమాదంలో 11 మంది సజీవదహనమయ్యారు. ప్రమాదం వివరాలు ఇలా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సికింద్రాబాద్ బోయిన్‌గూడలోని ఓ టింబర్ డిపోలో ఇవాళ తెల్లవారుజామున బారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్క్రాప్ గోడౌన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. డిపో అంతా తగలబడింది. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 15 మంది కార్మికులు అక్కడే నిద్రిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 11 మంది సజీవదహనయ్యారు. నలుగురికి గాయాలు కాగా..ఆసుపత్రికి తరలించారు. మృతులంతా బీహార్ వాసులుగా గుర్తించారు. డిపో అంతా కలప కావడంతో మంటల తీవ్రత అధికమైంది. 


[[{"fid":"225283","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Timber Depot in Secunderabad Fired","field_file_image_title_text[und][0][value]":"సికింద్రాబాద్ టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Timber Depot in Secunderabad Fired","field_file_image_title_text[und][0][value]":"సికింద్రాబాద్ టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం"}},"link_text":false,"attributes":{"alt":"Timber Depot in Secunderabad Fired","title":"సికింద్రాబాద్ టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం","class":"media-element file-default","data-delta":"1"}}]]


ఉదయం 2-3 గంటల మధ్య ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. దాదాపు 8 ఫైరింజన్ల సహాయంతో మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. మంటల ధాటికి గోడౌన్ పైకప్పు కూలిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. భారీగా మంటలు, పొగ అలముకోవడంతో సహాయకచర్యలు కష్టంగా మారాయని అధికారులు తెలిపారు.


[[{"fid":"225284","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Secunderabad Fire Accident","field_file_image_title_text[und][0][value]":"సికింద్రాబాద్ టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Secunderabad Fire Accident","field_file_image_title_text[und][0][value]":"సికింద్రాబాద్ టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం"}},"link_text":false,"attributes":{"alt":"Secunderabad Fire Accident","title":"సికింద్రాబాద్ టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం","class":"media-element file-default","data-delta":"2"}}]]


ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు..మృతుల్లో బిట్టు, సికిందర్, దామోదర్, సత్యేందర్, చింటు, దినేష్, రాజు, దీపక్, పంకజ్ ఉన్నట్టు తెలిసింది. ప్రమాద స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 


Also read: Fuel Prices In Hyderabad: వాహనదారులకు మరో షాకింగ్ న్యూస్.. భగ్గుమంటున్న పెట్రో ధరలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook