Ujjaini Mahankali Secunderabad Bonalu: తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలిచే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి వచ్చి బోనాలు సమర్పించుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు మహంకాళి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. అయితే లష్కర బోనాల ఏర్పాట్లు అధికారుల తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. అధికార పార్టీ కనుసన్నల్లోనే ఆలయ అధికారులు పని చేస్తున్నారని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహంకాళి అమ్మవారి దర్శనానికి వచ్చిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో పోలీసులు వాగ్వాదానికి దిగారు. రేవంత్ రెడ్డితో పాటు ఆలయానికి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతల వెంట వందలాది మందిని పంపిస్తూ తమను అడ్డుకోవడం ఎందుకని ప్రశ్నించారు. ఒక్కొక్కరికి ఒక్కోలా ప్రోటోకాల్ పాటిస్తున్నారంటూ పోలీసులపై మండిపడ్డారు. ఓ దశలో ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన బారికేడ్లు తోసుకుని లోపలికి వెళ్లారు రేవంత్ రెడ్డి, సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజనికుమార్ యాదవ్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మనిక్కం ఠాగూర్ కూడా సికింద్రాబాద్ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు.


అమ్మవారి దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ప్రభుత్వం ప్రజలకు విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. క్రూరమైన బుద్ధితో పాలించే వారి మనసు మార్చాలని,   మారకుంటే వారినే మార్చాలని అమ్మవారిని కోరుకున్నానని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రకృతి విపత్తుల నుంచి అమ్మవారు ప్రజలను కాపాడుకుంటుందని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం రాకుండా, ప్రకృతి వైపరిత్యాలు సంభవించకుండా, మత సామరస్యాన్ని కాపాడాలని కోరుకున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా అమ్మ వారి చల్లని దీవేనలు ఉండాలని ప్రార్ధించానని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి హాని కలిగించే అనేక కార్యక్రమాలు పాలకులు తీసుకుంటున్నారని.. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమన్నారు. కృరమైన ఆలోచనలతో పరిపాలిస్తున్న కేంద్ర, రాష్ట్ర పాలకుల బుద్దులు మార్చాలని అమ్మ వారిని కోరుకున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.


మరోవైపు సికింద్రాబాద్ పరిధిలోని బీజేపీ కార్పొరేటర్లు మహంకాళి ఆలయ ఏర్పాట్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ఆలయమా... టీఆర్ఎస్ ఆఫీస్ అని నిలదీశారు. మమ్మల్ని లోపలికి అనుమతించకుండా... గంటల తరబడి నిలబెడుతున్నారని మండిపడ్డారు. 



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.