Ex Minister D Srinivas: కాంగ్రెస్ సీనియర్ నేత.. మాజీ మంత్రి డీ శ్రీనివాస్ గుండెపోటుతో కన్నుమూత..
Ex Minister D Srinivas Death: డీ శ్రీనివాస్‌కు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్దకుమారుడు సంజయ్, రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ ఎంపీ. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించినట్లు ఇటీవలె అర్వింద్ ట్వీట్ కూడా చేశారు.
Ex Minister D Srinivas Death: తెలంగాణ మాజీ మంత్రి డీ శ్రీనివాస్ తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతూ ఈ తెల్లవారు జాము 3 గంటల సమయంలో కన్నుమూశారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయన పీసీసీ ఎంపీ, మంత్రి, అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈ మాజీ మంత్రి ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.
డీ శ్రీనివాస్‌కు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్దకుమారుడు సంజయ్, రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ ఎంపీ. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించినట్లు ఇటీవలె అర్వింద్ ట్వీట్ కూడా చేశారు. కొంత కాలంగా ఈయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
ఇదీ చదవండి: సికింద్రాబాద్ లో రైలు నుంచి భారీగా ఎగిసిపడుతున్న మంటలు.. షాకింగ్ వీడియో వైరల్..
రాజకీయ ప్రస్థానం..
1948 సెప్టెంబర్ 27న నిజామాబాద్‌లో జన్మించిన డీ శ్రీనివాస్ ఏపీసీసీ మంత్రి, ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. 1989, 1999, 2004 ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతేకాదు ఈయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా కూడా పనిచేశారు. అయితే, 2015 నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2015 జూలై 2న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అప్పట్లో బీఆర్‌ఎస్‌లో చేరిన శ్రీనివాస్, ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు.
ఇదీ చదవండి: బొగ్గు వేలంలో పాల్గొనే వారికి కేటీఆర్ హెచ్చరిక.. తస్మాత్ జాగ్రత్త
ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన డీఎస్ హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉదయం 3 గంటల సమయంలో గుండెపోటుతో మరణించారు. జూబ్లీహిల్స్‌లోని వారి నివాసంలోనే భౌతికదేహం ఉంచారు. అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్‌కు మెరుగైన వైద్యం అందించారు. కానీ, ఆరోగ్యం సహకరించకలేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి