తెలంగాణ ఎన్నికలు ముగిసిన తరుణంలో ఇప్పుడు దృష్టంతా ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై పడింది. ఈ సందర్భంగా రాజకీయ కురువృద్ధుడు హరిరామజోగయ్య ఏపీ రాజకీయాలపై మరోసారి గళం విప్పారు. మంగళవారం మాజీ ఎంపీ హరిరామ జోగయ్య ఓ ప్రముఖ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు రాజకీయ తప్పిదాలను ఎత్తిచూపారు. చంద్రబాబు చేసిన  ఆ మూడు పెద్ద తప్పులే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అధికారం నుంచి దూరం చేస్తాయని జోస్యం చెప్పారు. ఇంతకీ హరిరామజోగయ్య ఎత్తిచూపిన ఆ పెద్ద తప్పులేంటో ఒక్క సారి పరిశీలిద్దాం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

* ఎన్డీయే నుంచి టీడీడీ బయటకు రావడం -  ఫలితంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆగిపోయాయి
* పవన్‌ కల్యాణ్‌ ను దూరం చేసుకోవడం చంద్రబాబు రెండో తప్పిదం - కాపు వర్గానికి దూరమయ్యారు
* కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకోవడం - రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ ను ప్రజలు మరిచిపోలేదు.. ఆ వ్యతిరేకత టీడీపీపై చూపే అవకాశం


ఏపీ ఎన్నికల పై తెలంగాణ ఎఫెక్ట్..


ఏపీలో రాజకీయ పరిస్థితులపై స్పందించిన ఆయన వచ్చే ఎన్నికల్లో టీడీపీ పరిస్థితిని ఇలా విశ్లేషించారు. ఇదే సమర్భంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలపై కూడా స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ ఓటమి ప్రభావం తప్పకుండా ఏపీ ఎన్నికల్లో ప్రభావితం చేసే అవకాశముందని ఈ సందర్భంగా హరిరామ జోగయ్య విశ్లేషించారు.