Toll Gates to be closed in Telangana: జాతీయ రహదారులపై ఇబ్బడిముబ్బడిగా ఉన్న టోల్ ప్లాజాలతో  ఇబ్బంది పడుతున్నారా? టోల్ ఫీజులతో మీ జేబులు గుల్ల అవుతున్నాయా? అయితే మీకో గుడ్ న్యూస్. త్వరలో కొన్ని టోల్ ప్లాజాలు మాయమవుతున్నాయి.  జాతీయ రహదారులపై ఉన్న  కొన్ని టోల్ ప్లాజాలను ఎత్తివేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.  60 కిలోమీటర్లు అంతకంటే తక్కువ దూరంలో టోల్‌గేట్లు ఉంటే ఒకదాన్ని మూసేయనున్నట్లు  ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు నిధుల డిమాండ్‌పై సమాధానమిస్తూ లోక్‌సభలో ఈ మేరకు ఆయన ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర మంత్రి ప్రకటనతో రాష్ట్రంలోని జాతీయ రహదారులపై ఉన్న కొన్ని టోల్‌ప్లాజాలను మూసివేసేందుకు ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి.  నిబంధనల ప్రకారం జాతీయ రహదారులపై 60 కిలోమీటర్ల లోపు రెండు టోల్ గేట్లు ఉండకూడదు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొన్ని టోల్‌ గేట్లు  అలా పని చేస్తున్నాయి. కేంద్రమంత్రి చేసిన ప్రకటనతో అలాంటి టోల్ గేట్లు మూతపడనున్నాయి. కేంద్రం కొత్త పాలసీకి అనుగుణంగా టోల్ గేట్ల మూసివేత దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు.  


తెలంగాణలో ఉన్న జాతీయ రహదారులపై ప్రస్తుతం 29 టోల్‌ గేట్లు ఉన్నాయి. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం  కొన్ని తీసివేయాల్సి ఉంది. వాటిల్లో  విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ సమీపంలో ఉన్న పంతంగి, కొత్తగూడెం, మన్ననూరు, షాద్ నగర్‌లోని రాయ్‌కల్, గుమ్మడిదల, గూడూరు, కడ్తాల్‌ టోల్‌ప్లాజాలను తొలగించాల్సి ఉంటుంది. అయితే ఈ టోల్ గేట్ల తొలగింపుపై కేంద్రం అధికారికంగా ఓ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కొన్ని టోల్ గేట్లు (Toll gates latest news) తొలగించాలన్న నిర్ణయంపై వాహనదారుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.


Also Read: Womens World Cup 2022: చెలరేగిన భారత మహిళలు.. దక్షిణాఫ్రికా ముందు భారీ టార్గెట్! గెలిస్తేనే మిథాలీసేన సెమీస్‌కు!


ALso Read: Allu Arjun Car: టాలీవుడ్ సెలెబ్రిటీల కార్లకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల జరిమానా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook