Dasoju Sravan: తెలంగాణలో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ..పార్టీ వీడిన సీనియర్ నేత..!
Dasoju Sravan: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్ మీద షాక్‌లు తగులుతున్నాయి. మరో కీలక నేత పార్టీని వీడారు. ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు.
Dasoju Sravan: కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత దాసోజు శ్రవణ్ రాజీనామా చేశారు. దీంతో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సభ్యత్వానికి, కీలక పదవులకు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. త్వరలో బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల టీఆర్ఎస్ కార్పొరేట్ విజయారెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో అప్పటి నుంచి దాసోజ్ శ్రవణ్ అసంతృప్తిగా ఉన్నారు. రేవంత్‌రెడ్డి తీరుపై గాంధీ భవన్‌లోనే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
రాబోయే ఎన్నికల్లో ఆయన ఖైరతాబాద్ అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారు. విజయారెడ్డి రాకతో ఆ టికెట్‌పై గందరగోళం నెలకొంది. ఆమెకే ఖైరతాబాద్ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్‌లో ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే మాజీ సీఎల్పీ నేత పీజేఆర్ కూతురు విజయారెడ్డి కావడం..ఆమెకు నియోజకవర్గంలో పట్టు ఉండటంతో దాసోజ్ శ్రవణ్‌కు టికెట్ ఇచ్చే అవకాశం లేదు. గత ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ చేసి దానం నాగేందర్ చేతిలో ఓడిపోయారు.
దీంతో విజయారెడ్డికే టికెట్ ఇవ్వాలని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో బీజేపీ నుంచి స్పష్టమైన హామీ రావడంతో కాంగ్రెస్‌కు శ్రవణ్ రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. భారీ బహిరంగసభ ద్వారా కమలం పార్టీలో చేరనున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవల కాంగ్రెస్‌కు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. త్వరలో బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు.
[[{"fid":"240414","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
దీంతో కాంగ్రెస్‌కు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఇటు కాసేపట్లో ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్‌షాతో ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీకానున్నారు. భేటీ అనంతరం ఓ క్లారిటీ రానుంది. ఆయన కూడా కాంగ్రెస్‌ను వీడుతున్నారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో ఉప ఎన్నికలే టార్గెట్‌గా బీజేపీ పావులు కదుపుతోంది. మునుగోడులో గతంలో ఎన్నడు లేనివిధంగా పక్క ప్రణాళికతో కమలనాథులు ముందుకు వెళ్తున్నారు.
Also read:TS Govt: సిజేరియన్లు తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!
Also read:Komatireddy Venkat Reddy: బీజేపీ గూటికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి..? కమలనాథుల ప్లాన్ అదేనా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook