Shocking incident at Ramagundam Railway Station: రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులంతా చూస్తుండగానే ఓ యువకుడు రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైలు ప్లాట్‌ఫామ్‌ పైకి వచ్చిన సమయంలో... ఒక్కసారిగా ట్రాక్ (Railway track) పైకి దూకేశాడు. ఆపై రైలు ఎదురుగా నిలబడి.. అది ఢీకొట్టడంతో దాని చక్రాల కింద నలిగిపోయాడు. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రయాణికులు ఎంత వారించినా అతను వినిపించుకోలేదు. పెద్దపల్లి (Peddapalli) జిల్లా రామగుండం రైల్వే స్టేషన్‌లో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... సంజయ్ కుమార్ (27) అనే ఒడిశా యువకుడు తన తాతతో కలిసి హైదరాబాద్‌లోని (Hyderabad) ఓ హార్ట్‌వేర్ షాపులో పనిచేస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ కొన్నేళ్లుగా మతిస్థిమితం కోల్పోయాడు. కుటుంబ సభ్యులు అతనికి వైద్య చికిత్స చేయిస్తున్నారు. అయినప్పటికీ అతని ప్రవర్తనలో పెద్దగా మార్పు రాలేదు. ఇదే క్రమంలో ఆదివారం (నవంబర్ 21) ఉదయం సంజయ్ హైదరాబాద్ నుంచి రామగుండం (Ramagundam) రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు.


Also Read: బ్రేకింగ్: నీటి ప్రవాహంలో చిక్కుకున్న బస్సు.. 30 మంది ప్రాణాలు కాపాడిన స్థానికులు


సాయంత్రం వేళ న్యూఢిల్లీ-బెంగళూరు సూపర్‌ఫాస్ట్ రైలు ప్లాట్‌ఫామ్‌ పైకి వచ్చిన సమయంలో... ఒక్కసారిగా ట్రాక్ పైకి (Man commits suicide) దూకేశాడు. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రయాణికులు వారిస్తున్నప్పటికీ వినిపించుకోలేదు. రైలుకు ఎదురెళ్లి నిలబడ్డాడు. క్షణాల్లో రైలు అతని ఢీకొట్టడంతో దాని చక్రాల కింద నలిగిపోయాడు. కళ్లెదుటే ఈ దారుణం చోటు చేసుకోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. మృతదేహాన్ని రైల్వే పోలీసులు పోస్టుమార్టమ్ నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి