Firing in Delhi-bound Train: సికింద్రాబాద్ నుండి హజరత్ నిజాముద్దీన్ వెళ్లే దురంతో ఎక్స్‌ప్రెస్ రైల్లో కాల్పులు కలకలం చోటుచేసుకుంది. రైలు మంచిర్యాల వద్దకు చేరుకున్న సమయంలో ప్రయాణికులతో ఇద్దరు స్నేహితులు వాగ్వీవాదానికి దిగారు. ఈ వాగ్వీవాదం కాస్తా ఘర్షణకు దారి తీయడంతో వారిలో ఒక వ్యక్తి గాల్లోకి కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో రైలులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇదే విషయమై టికెట్ కలెక్టర్ అందించిన సమాచారంతో రైల్వే పోలీసులు.. కాల్పులకు కారణమైన ఇద్దరు వ్యక్తులను కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రైల్లో రివాల్వర్‌తో కాల్పులకు పాల్పడిన వ్యక్తులను విశాల్, బల్విందర్ సింగ్‌గా గుర్తించారు. టికెట్ కలెక్టర్ ఇచ్చిన సమాచారంతోనే రైల్వే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వారిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది. కాల్పులకు పాల్పడిన నిందితులు ఆర్మీ జవాన్లా, రిటైర్డ్ జవాన్ల అనే విషయంలో స్పష్టత కొరవడింది. ప్రస్తుతం సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వై పోలీసులు నిందితులను ప్రశ్నిస్తున్నారు.


Also Read : Heavy Rains in Telangana : ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి.. ఆ 4 జిల్లాల్లో హై అలర్ట్


Also Read : Telangana Floods: గోదావరిఖని-మంచిర్యాల బ్రిడ్జి పైకి భారీగా వరద నీరు.. 1995 తర్వాత ఇదే తొలిసారి..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook