Hyderabad: ఫామ్ హౌస్ లో షాకింగ్ ఘటన.. స్విమ్మింగ్ ఫుల్ లో షార్ట్ సర్క్యూట్.. ఇద్దరు సీరియస్.. మరో 16 మంది..
Hyderabad: హైదరాబాద్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నాంపల్లి ఆగాపురా ప్రాంతంలో నివాసముండే మూడు కుటుంబాలకు చెందిన 56 మంది జల్పల్లిలోని ఓ ఫాంహౌస్‌కు సరదాగా గడపడానికి వెళ్లారు. అక్కడే ఉన్న స్విమ్మింగ్ ఫుల్ లోకి దిగారు.
Short circuit incident in jalpally farmhourse Hyderabad: చాలా మంది వర్షాకాలం సమయంలో లేదా వీకెండ్ దొరగ్గానే తమ వాళ్లతో గడపడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా వారంతంలో కొత్త ప్రదేశాలకు , వాటర్ ఫాల్స్, పార్కులకు ఎక్కువగా వెళ్లడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇదిలా ఉండగా.. కొన్ని సార్లు విహార యాత్రలు, కాస్త విషాదాలుగా మారుతుంటాయి. సెల్ఫీల కోసం, రీల్స్ కోసం కొందరు అతిగా ప్రవర్తిస్తుంటారు. కొండలు,జలపాతాల వద్ద లేని పోనీ రిస్క్ లు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రమాదాలు జరుగుతుంటాయి.
Read more: Snakes smuggling: అక్కడ ఎలా దాచావ్ భయ్యా.. ప్యాంటులో 100 కు పైగా బతికున్న పాములు.. వీడియో వైరల్.
ఇలాంటి ఎన్నో ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కొకొల్లలు. అందుకు కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చిన్న పిల్లల్ని తీసుకెళ్లినప్పుడు వారిని అస్సలు విడిచిపెట్టకూడదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో సరదాగా గడపడానికి వెళ్లిన చిన్నారులు కరెంట్ షాక్ కు గురైన సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.
పూర్తివివరాలు..
హైదరాబాద్ లో శివారులోని.. జల్ పల్లిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అక్కడ కొన్ని కుటుంబాలు జల్ పల్లిలోని ఫామ్ హౌస్ లో సరదాగా గడపడం కోసం వెళ్లాయి. అక్కడే ఉన్న స్విమ్మింగ్ ఫుల్ లో కొందరు చిన్నారులు ఆసక్తిగా చూశారు. ఒక్కసారిగా అందులో స్విమ్ చేయాలని అందరు స్విమ్మింగ్ హౌస్ లోనికి దిగారు. ఒక్కసారిగా చిన్నారులు గట్టిగా అరుపులు, కేకలు పెట్టడం మొదలు పెట్టారు. ఒడ్డున ఉన్నవారికి ఈ విషయం మాత్రం అస్సలు తెలియలేదు. వెంటనే తెరుకుని, కొందరు పక్కకు పరుగులు పెట్టారు. స్విమ్మింగ్ ఫుల్ లో కరెంట్ సప్లై జరిగినట్లు తెలుసుకున్నారు.
ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో 16 మంది కూడా గాయపడ్డారు. వెంటనే స్థానికులు చిన్నారులను హుటా హుటీన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. స్విమ్మింగ్ ఫుల్ లో.. కరెంట్ వయర్ తెగి పడటం వల్ల ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు, పెద్దవాళ్లు కూడా ఉన్నారు.
నిన్న సాయంత్రం..కొలను మధ్యలోని వెళ్లిన.. పర్వేజ్, ఇంతియాజ్ లు మాత్రం తీవ్రంగా గాయపడ్డారని, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఈత కొలున లైటింగ్ కోసం ఏర్పాటు చేసుకున్న.. వైరింగ్ తెగిపోవడం వల్ల ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు. సంఘటన స్థలానికి చేరుకుని ఘటనపై విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి