SI Srinivas Reddy in sexual harassment case: మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఎస్సై శ్రీనివాస్ రెడ్డికి జిల్లా కోర్టు 14 రోజుల జుడిషియల్ రిమాండ్ విధించింది. ఇదే మరిపెడ పోలీసు స్టేషన్‌లో ప్రొబేషనరి ఎస్సైగా ఉన్న దళిత మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడనే కేసులో పోలీసులు ఆయన్ని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుచగా కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాలతో జిల్లా పోలీసులు ఎస్సై శ్రీనివాస్ రెడ్డిని మహబూబాబాద్ సబ్ జైలుకు తరలించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎస్సై శ్రీనివాస్ రెడ్డిపై అత్యాచారయత్నం కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు (sc/st atrocities act) కింద కేసు నమోదు చేసినట్టు మహబూబాబాద్ ఎస్పీ కోటి రెడ్డి తెలిపారు. తనను రాత్రివేళ విధుల్లోకి పిలిచి అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడిన శ్రీనివాస్ రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాల్సిందిగా కోరుతూ సదరు బాధితురాలు వరంగల్ పోలీసు కమిషనర్ తరుణ్ జోషికి ఫిర్యాదు చేసిన అనంతరం ఈ ఉదంతం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఎస్సై శ్రీనివాస్ రెడ్డిపై చర్యలు తీసుకోనట్టయితే తాను తన ఉద్యోగానికి రాజీనామా చేస్తానని బాధితురాలు (Trainee SI) స్పష్టంచేశారు.


Also read: Mariyamma lockup death case: మరియమ్మ లాకప్ డెత్ కేసులో ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు డిస్మిస్


దళిత మహిళా ట్రైనీ ఎస్సైపై (Probationary SI) అత్యాచారయత్నం కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు.. ఎస్సై శ్రీనివాస్ రెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగాయి. ప్రభుత్వం ఈ కేసులో వెంటనే విచారణ జరిపించి బాధితురాలికి న్యాయం చేయాల్సిందిగా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నేతలు పట్టుబట్టారు. 


ఈ క్రమంలోనే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై శ్రీనివాస్ రెడ్డిని మంగళవారం సస్పెండ్ చేసిన (SI Srinivas Reddy) పోలీసు ఉన్నతాధికారులు తాజాగా ఆయన్ని కోర్టు ఎదుట హాజరుపరిచి కోర్టు ఆదేశాల మేరకు జిల్లా సబ్ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కోటి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చట్టం ఎవరికీ చుట్టం కాదని, చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరికైనా శిక్ష తప్పదు అని అన్నారు.


Also read : Addaguduru lockup death case: అడ్డగూడూరు లాకప్ డెత్ కేసులో ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్ సస్పెన్షన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook