సీఎం కేసీఆర్ కు తృటిలో తప్పిన ప్రమాదం..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు తృటిలో ప్రమాదం తప్పింది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు తృటిలో ప్రమాదం తప్పింది. హెలికాఫ్టర్ లోని కమ్మ్యునికేషన్ బ్యాటరీ కిట్ బ్యాగ్ నుంచి పొగలు వచ్చాయి. వెంటనే అక్కడున్న భద్రతా సిబ్బంది ఆ బ్యాగ్ ను దూరం తీసుకెళ్లి పడేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ ఆదిలాబాద్ జిల్లా ఆర్మూర్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు.
ఈ విషయంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తాను సీఎంవో కార్యాలయం అధికారులతో మాట్లాడాడని.. అంతా సవ్యంగానే ఉందని పేర్కొన్నారు. సీఎం పర్యటన యథావిధిగా జరుగుతుందని తెలిపారు.