రేవంత్ బాటలో టీడీపీ ముఖ్య నేతలు ?
టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి రాజీనామా అనంతరం ఆయన బాటలోనే మురికొందరు టీడీపీ నేతలు పయనిస్తారని ఊహాగానాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఎవరెవవరు ఆయన బాటలో పయనిస్తారనే అంశంపై ఇప్పటి వరకు ఉత్కంఠత నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఆయన వెంట ఎవరెవరు కాంగ్రెస్ చేరుతున్నారనే విషయం కన్ఫాఫ్ అయింది.
రేవంత్ తో పాటు కాంగ్రెస్ లో చేరే టీడీపీ ముఖ్య నేతల్లో మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీతక్క, వేం నరేందర్ రెడ్డి, బోడ జనార్దన్, అరికెల నర్సారెడ్డి, సోయం బాపూరావు, భూపాల్ రెడ్డి తదితరులు ఉన్నట్టు తెలిసింది. కాంగ్రెస్ లో చేరే విషయమై వీరు కార్యకర్తలతో చర్చిస్తున్నట్టు తెలిసింది. కార్యకర్తల అభిప్రాయాలను సేకరించిన అనంతరం వీరకు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. వీరితో పాటు వివిధ జిల్లాల నుంచి వేల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు సమాచారం. కాగా మరి కొందరు సీనియర్ నేతలు మరికొన్ని రోజుల వేచి చూద్దామన్న ధోరణిలో ఉన్నట్లు విశ్వసనీయవర్గాల నుంచి సమచారం.