Sonu Sood On Gang Rape: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన హైదరాబాద్ గ్యాంగ్ రేప్ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగుచూస్తోంది. పోలీసు కస్టడీలో నిందితులు కీలక విషయాలు వెల్లడిస్తున్నారు. నిందితులు చెబుతున్న వివరాలతో పక్కా ప్లాన్ ప్రకారమే మైనర్ బాలికను పబ్ లో ట్రాప్ చేసి.. కారులో తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసినట్లు పోలీసులు నిర్దారించారు. జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటనపై తాజాగా  బాలీవుడ్ నటుడు సోనుసూద్ స్పందించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్యాంగ్ రేప్ ఘటనపై మీడియాలో వచ్చిన వార్తలు చూసి షాకయ్యానని చెప్పారు సోనుసూద్. ఇది చాలా పెద్ద నేరమన్నారు. క్రైం చేశాక మేజర్.. మైనర్ అని చూడటం సరికాదన్నారు. చేసిన నేరాన్ని బట్టే శిక్షలు ఉండాలన్నారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాల్సి ఉందన్నారు. ఇలాంటి ఘటనలకు పబ్సే కారణమన్నది చాలా తప్పు అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మైనర్ అమ్మాయిలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని సోను సూద్ చెప్పారు. మనం ఆలోచించే పద్దతిలోనే అంతా  ఉంటుందన్నారు. పొట్టి పొట్టి బట్టలు వేసుకున్నారు అంటున్నారు కానీ.. మనం చూసే విధానం తప్పుగా ఉంటేనే చెడు ఆలోచనలే వస్తాయని సోనుసూద్ అన్నారు. గ్యాంగ్ రేప్ కేసు నిందితులకు కఠిన శిక్ష పడాల్సిందేనని సోనుసూద్ స్పష్టం చేశారు.


Read also: Jinnah Movie: వివాదంలో మంచు విష్ణు సినిమా.. టైటిల్‌పై బీజేపీ అభ్యంతరం! కోన వెంకట్‌ ఏమంటున్నారంటే


Read also: AP SSC STUDENTS: టెన్త్ ఫెయిల్ విద్యార్థులకు సీఎం జగన్ వరం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయం