Hyderabad Rain: హైదరాబాద్‌లో రెయిన్ అలర్ట్..అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ..!
Hyderabad Rain: హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి భానుడి భగభగలు కొనసాగగా..మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది.
Hyderabad Rain: హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి భానుడి భగభగలు కొనసాగగా..మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది. బేగం బజార్,ఎంజే మార్కెట్, సుల్తాన్ బజార్, శివరాంపల్లి, అబిడ్స్, బషీరాబాద్, నాంపల్లి, హిమయత్ నగర్, నారాయణగూడ, లిబర్టీ,సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్, హెచ్‌ఐసీసీ తదితర ప్రాంతాల్లో వాన పడింది.
భారీగా ఈదురుగాలుల వీయడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇటు వాహనదారులు సైతం ట్రాఫిక్ ఇక్కట్లు నరకయాతన పడ్డారు. ప్రధాని మోదీ సభ జరగనున్న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ప్రాంతంలో వర్షం కురిసింది. దీంతో బీజేపీ కార్యకర్తలు ఇక్కట్లు పడ్దారు. సభా ప్రాంగణంలో రెయిన్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేశారు. మరోవైపు మరో మూడురోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయని వాతారణ శాఖ హెచ్చరించింది.
రాష్ట్ర రాజధానితోపాటు ఇతర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపింది. నైరుతి రుతుపవనాలకు ఉపరితల ఆవర్తనం తోడు అయ్యింది. ఉపరితల ఆవర్తనం కాస్త రాగల 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కిందిస్థాయి గాలులు పశ్చిమ, నైరుతి దిశల నుంచి తెలంగాణ వైపు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో విస్తారంగా వానలు పడతాయని పేర్కొంది.
Also read:India vs England: టీమిండియాకు గుడ్‌న్యూస్..అందుబాటులోకి వచ్చిన స్టార్ ప్లేయర్..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook