శ్రీలంక ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్ కు చెందిన ఎన్ఐఏ బృందం మరింత అప్రమత్తమైంది. హైదరాబాద్ లో అసాంఘిక శక్తుల కదిలికలపై డేగకన్ను వేసి ఉంచింది.  ఉగ్రవాదులు కానీ..వారికి సంబంధించిన సానుభూతి పరులకు సంబంధించిన ఏమాత్రం  క్లూ దొరికినా ఇట్టే పట్టేసే పగఢ్బంది ప్లాన్ రెడీ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ మీడియా కథనం ప్రకారం కొలంబో దాడులకు ముందు రోజు ఎన్ఐఏ మైలార్ దేవ్ పల్లిలో సోదాలు నిర్వహించి కీలక ఆధారాలు చేపట్టాయి. నలుగురు సానుభూతి పరులను అదుపులోకి తీసుకున్నారు. శ్రీలంక దాడుల నేపథ్యంలో  భాగ్యనగరంలో రెచ్చిపోయే అవకాశముందని ఇంటెలిజెన్సీ బృందం హెచ్చరించిన నేపథ్యంలో ఎన్ఐఏ ముందస్తుగా చర్యలు చేపడుతోంది.


శ్రీలంక దాడుల తరహా హైదారాబాద్ లో విధ్వంసం సృష్టించేందుకు 2016లో ఉగ్రమూకలు విఫలయత్నం చేశారు. నిఘా వర్గం హెచ్చరికలతో అరల్ట్ అయిన ఎన్ఐఏ  బలగాలు సమర్ధవంతంగా తిప్పికొట్టాయి. అయితే అప్పటి నుంచి ఐసీఎస్ ఆనావళ్లు భాగ్యనగరంలో బయపడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ బృందం హైదరాబాద్ నగరంపై ప్రత్యేక నిఘా పెట్టి ఉంచింది