Nagarjuna Sagar: కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది.  దీంతో కృష్ణా నది పరివాహాక ప్రాంతాల్లో డ్యాములు జలకళను సంతరించుకున్నాయి.  ఇప్పటికే శ్రీశైలం ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు ప్రాజెక్ట్స్ 10 క్రస్ట్  గేట్స్ ఓపెన్ చేసి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు శ్రీశైలం రెండు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్పత్తి చేస్తూ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.దీంతో దిగువనున్న నాగార్జున నాగర్ కు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ఈ రోజు నాగార్జున సాగర్ క్రస్టు గేట్లు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఎత్తబోతున్నారు. ఈ సందర్భంగా కృష్ణమ్మకు ప్రభుత్వ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి చీర సారెను సమర్పించిన తర్వాత గేట్లు ఎత్తుతారు. మరోవైపు శ్రీశైలం నుంచి వచ్చే వరదను దృష్టిలో ఉంచుకొని క్రస్టు గేట్లు ఎత్తు సమయంలో మార్పు ఉండే అవకాశం ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ప్రస్తుతం నాగార్జున్ కు 4,41,183 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. మరోవైపు ఔట్  ఫ్లో : 40,516 క్యూసెక్కుల్లుగా ఉంది. నాగార్జున సాగార్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 580.40 అడుగులకు చేరుకుంది. నాగార్జున సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 312.50 శతకోటి ఘనపుటడుగులు (టీఎంసీ) కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 284.1688 శత కోటి ఘనపుటడుగులు (టీఎంసీ) వుంది.


దీంతో దిగువకు 56 వేల క్యూసెక్కుల వరద నీరు దిగువకు ఒదిలుతున్నారు. శ్రీశైలంతో పాటు ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలకు నాగార్జున సాగర్‌లో క్రమంగా  నీటిమట్టం పెరుగుతోంది. ఎగువన శ్రీశైలం నుంచి 2.16 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఇప్పటికే నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు దాదాపు నిండిపోయే పోజిషన్ కు వచ్చేసింది.  కృష్ణాబేసిన్‌లో సాగర్‌ దిగువన ఉన్న పులిచింతల మినహా మిగిలిన ప్రాజెక్టులన్నీ నిండు కుండల్లా కళకళ లాడుతున్నాయి. శ్రీశైలం గేట్లు ఎత్తడంతో కృష్ణా ప్రవహించే పరివాహాక ప్రాంతాల్లోని ప్రజలను ప్రభుత్వం జాగ్రత్తలు జారీ చేసింది. అంతేకాదు అక్కడ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేస్తోంది.  


ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!


ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter