GHMC Elections 2020: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆశించిన విజయాన్ని సాధించలేకపోవడం, బీజేపీ ఊహించనంతగా బలపడటం టీఆర్ఎస్‌కు మింగుడు పడటం లేదు. గత ఎన్నికల్లో 4 స్థానాలున్న బీజేపీ 44కు ఎలా  పెంచుకోగలిగింది..99 స్థానాలున్న టీఆర్ఎస్ బలం 55 కు పడిపోయింది. దీనికి కారణాలేంటి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


మజ్లిస్ లేదా ఎంఐఎం సాంప్రదాయ ఓటు బ్యాంకే ( MIM Traditional vote bank ) టీఆర్ఎస్‌ను సైలెంట్‌గా దెబ్బకొట్టిందనేది విశ్లేషకులు మాట. మజ్లిస్‌పై మాటల దూకుడు టీఆర్ఎస్ ( TRS ) ‌కు నష్టాన్ని చేకూర్చింది. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలు బీజేపీ వశమయ్యాయి. నగరంలోని ఇతర ప్రాంతాల్లో అంటే మజ్లిస్ బరిలో లేని చోట ముస్లిం ఓట్లు టీఆర్ఎస్‌కు పూర్తిగా పడ లేదని తెలుస్తోంది. ముస్లిం గళంగా మారి నగర రాజకీయాల్ని శాసిస్తున్న ఎంఐఎం పార్టీ ( MIM )కి ముస్లిం ప్రాబల్యమున్న ప్రాంతాల్లో సాంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. 


గత ఆరేళ్లుగా టీఆర్ఎస్‌తో బంధమున్నా ప్రత్యక్షంగా ఎప్పుడూ పొత్తు కుదుర్చుకోలేదు. స్నేహపూర్వకపోటీనే సాగింది. మజ్లిస్ బరిలో లేని ప్రాంతాల్లో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్దుల్ని బలపర్చడమే కాకుండా..ఏకంగా ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేసేది మజ్లిస్ పార్టీ. అయితే ఈసారి అలా జరగలేదు. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం ఓటింగ్‌పై పడింది. 


ముఖ్యంగా మలక్ పేట అసెంబ్లీ ( Malakpet assembly ) సెగ్మెంట్ పరిధిలోని సైదాబాద్, మూసారం బాగ్, యూకుత్ పురాలోని ఐఎస్ సదన్ డివిజన్‌లో మజ్లిస్ పార్టీ బరిలో దిగకుండా టీఆర్ఎస్‌కు లోపాయికారీగా మద్దతిచ్చేది. బీజేపీ ఆరోపణల్నించి తప్పించుకునేందుకు రెండు పార్టీలు దూరాన్ని పాటించాయి. ఇదే కొంప ముంచినట్టు అర్ధమౌతోంది. ఈసారి మజ్లిస్ పార్టీ సహకారం లేకపోవడంతో మలక్ పేట పరిధిలో మూడు సిట్టింగ్ స్థానాలు బీజేపీ పరమయ్యాయి. 


ఇక జూబ్లీహిల్స్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్ , ముషీరాబాద్, అంబర్ పేట, ఎల్ బి నగర్, సికింద్రాబాద్, పఠాన్ చెరువు అసెంబ్లీ సెగ్మెంట్లలో కొంతవరకూ మజ్లిస్ పార్టీకు ఓటుబ్యాంకు ఉంది. ఈ డివిజన్లలో మజ్లిస్ పార్టీ దూరంగా ఉండటంతో ఇక్కడున్న ముస్లిం ఓటుబ్యాంకు పూర్తిగా టీఆర్ఎస్‌కు బదిలీ కాలేదు. అందువల్లనే..ఈ పరిస్థితి ఎదురైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ రెండు పార్టీల చేసిన తప్పిదాన్ని బీజేపీ ( BJP ) పూర్తిగా వినియోగించుకుంది. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోగలగడమే తెలివైనవారి లక్షణం. బీజేపీ అదే చేసింది. Also read: Telangana: ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగులకు నో ఛాన్స్..గ్రేటర్ ప్రభావం