Dogs Attack on Boy: వీధి కుక్కల ఘతుకం.. చావుబతుకుల్లో మరో చిన్నారి
ఇటీవల వీధి కుక్కల దాడిలో బాలుడు మరణించిన సంగతి తెలిసిందే. అది మరవక ముందే హైదరాబాద్ లోని కాంచన్ బాగ్ లో వీధి కుక్కలు దాడిలో 3 ఏళ్ల బాలుడు గాయపడ్డాడు. అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదని బాలుడి తల్లిదండ్రులు, స్థానికులు వాపోయారు.
Dogs Attack on Boy: కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో ఒక చిన్నారిని వీధి కుక్కలు అత్యంత దారుణంగా కొరికి చంపేసిన విషయం తెల్సిందే. ఆ సంఘటన తర్వాత కొన్ని రోజుల పాటు ప్రభుత్వ అధికారులు వీధి కుక్కల విషయంలో హడావుడి చేశారు.
రోడ్ల మీద కుక్కలు లేకుండా జాగ్రత్త పడ్డారు. వందల కుక్కలను మున్సిపల్ అధికారులు పట్టిన విషయం తెల్సిందే. ఆ కార్యక్రమం కొన్ని రోజులకే పరిమితం అయ్యింది. ఆ వెంటనే మళ్లీ కుక్కలు రోడ్డు మీదకు రావడం షరమామూలే అయ్యింది.
మొక్కుబడి చర్యల వల్ల మళ్లీ కుక్కల దాడితో చిన్నారులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఎంతో మంది కన్నవారికి కడుపు కోత మిగులుతూనే ఉంది. ప్రతి రోజు ఏదో ఒక మూల కుక్కలు చిన్న పిల్లలపై దాడి అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి.
హైదరాబాద్ లో మరోసారి వీధి కుక్కలు ఘాతుకంకు పాల్పడ్డాయి. కాంచన్ బాగ్ లోని వీధి కుక్కలు రెచ్చి పోయాయి. డీఆర్‌డీఓ టౌన్ షిప్ లో మూడు సంవత్సరాల బాలుడిపై అయిదు కుక్కలు దాడి చేశాయి. రోడ్డు పై ఉన్న కుక్కలు ఒంటరిగా వస్తున్న పిల్లాడిపై ఎగబడ్డాయి.
Also Read: WTC Final 2023 Prize Money: డబ్ల్యూటీసీ ఫైనల్ 2023.. విజేతకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?
ఒక్కసారిగా కుక్కలు దాడి చేయడంతో పిల్లాడు తప్పించుకోవడానికి లేకుండా పోయింది. ట్యూషన్ కు వెళ్లిన పిల్లాడి పై కుక్కలు దాడి చేశాయని తెలిసి వెంటనే తల్లిదండ్రులు పరుగు పరుగున వెళ్లారు. అప్పటికే కుక్కల దాడిలో రక్తపు మడుగులో పిల్లాడు ఉన్నాడు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
బాలుడి పరిస్థితి విషమంగా ఉందని.. ఎక్కువ రక్తం పోవడంతో పాటు షాక్ లో ఉన్నాడు అంటూ వైద్యులు పేర్కొన్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. టౌన్ షిప్ లో వంద కుక్కలు ఉన్నాయని గత కొన్నాళ్లుగా ఫిర్యాదు చేస్తున్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదని... అధికారులు కనీసం వచ్చి కూడా చూడలేదు అంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పిల్లలను కనీసం బయటకు కూడా పంపించేందుకు భయంగా ఉందని.. కుక్కలు కొన్ని సార్లు పెద్ద వారిపై కూడా ఎగబడుతున్నాయి అంటూ స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికి అయినా అధికారులు స్పందించి కుక్కల విషయమై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం అంటూ స్థానికులు పేర్కొన్నారు.
Also Read: Singer Chinmayi : అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తోందా?.. కమల్ హాసన్‌ని నిలదీసిన చిన్మయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి