Student appeals to KCR: తనకు చనిపోయేందుకు అనుమతివ్వాలంటూ పదవ తరగతి చదువుతున్న ఓ బాలుడు తెలంగాణ సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​ను కోరాడు. అక్క, బావల వేధింపులు తాలలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలు విషయం ఏమింటంటే..


ఖమ్మం జిల్లా నెలకొండపల్లిలోని బుద్ధారం ప్రభుత్వ పాఠశాలలో ఆ బాలుడి తండ్రి ఉపాధ్యాయుడిగా పని చేసేవాడు. కొన్నాళ్ల క్రితం ఆయన అనారోగ్యంతో మృతి చెందాడు. దీనితో ఆయన భార్యకు అటెండర్​గా ఉద్యోగం ఇచ్చింది ప్రభుత్వం.


ఉద్యోగం చేస్తూ ఆమె బాలుడుని చదివించేది.. కూతురు వివాహం కూడా చేసింది. ఇక గత ఏడాది ఆమె కూడా మరణించడంతో బాలుడు.. హుజూర్​నగర్​లోని అక్క దగ్గరకు చేరాడు.


అయితే ఆ బాలుడు బాగోగులు చూసుకోవాల్సిన ఆ అక్క.. తల్లి ఉద్యోగం, ఆస్తి, ఉన్న డబ్బులు అన్ని ఇవ్వాలంటూ తమ్ముడిపై ఒత్తిడి చేస్తోంది (బాలుడు చెప్పిన వివరాలు ఇవి). అమె భర్త కూడా ఇందుకు వంత పాడటంతో బాలుడు.. అక్క వద్ద నుంచి వచ్చేసి నేలకొండ పల్లిలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. చిన్న వయసులో ఒక్కడే రూంలో ఉంటూ చదువుకుంటున్నాడు.


అయినా కూడా అక్క, బావలు ఫోన్​ చేసి మరి ఆస్తి, ఉద్యోగం విషయమై ఒత్తిడి చేస్తున్నారని బాలుడు వాపోయాడు. ఈ ఒత్తిడి భరించలేక చనిపోవాలనుకుంటున్నట్లు చెప్పాడు. అయితే ఆత్మహత్య చేసుకునే ధైర్యం లేదని అందుకే కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని మీడియా ద్వారా కేసీఆర్​, కేటీఆర్​లను కోరాడు.


Also read: మినిస్టర్ సార్.. నా ఆత్మహత్యకు అనుమతినివ్వండి.. కేటీఆర్‌కు యువ రైతు లేఖ..


Also read: Telangana Corona Cases: తెలంగాణలో పెరిగిన కరోనా ఉద్ధృతి.. కొత్తగా 3,603 కొవిడ్ కేసులు నమోదు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook