Unemployed youth protest in Hyderabad on groups exams and dsc exam: తెలంగాణలో నిరుద్యోగులు, అనేక విద్యార్థి సంఘాలు ఈ రోజు భారీ ఎత్తున టీజీపీఎస్సీ, ప్రజాభవన్  వద్దకు తరలి వచ్చారు. అంతేకాకుండా.. గ్రూప్స్ ఎగ్జామ్ పోస్టులు పెంచాలని, అదేవిధంగా..డీఎస్సీ ఎగ్జామ్ లను మూడు నెలల పాటు వాయిదా వేయాలంటూ కూడా నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఎక్కడిక్కడ ఇనుమ కంచెలను ఏర్పాటుచేశారు. రోడ్డుపైన ఉన్న నిరుద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థి సంఘాలు నాయకులు, ఆయా పార్టీల నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో హైదరాబాద్ లో ఒక్కసారిగా రణ రంగంగా మారిపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



రోడ్డు మీద ఎవరు కన్పించిన కూడా పోలీసులు... అదుపులోకి తీసుకుని బస్సుల్లో ఎక్కిస్తున్నారు. రోడ్డుపైన వెళ్తున్న ఒక రైతు, విధులకు వెళ్తున్న ఒక లాయర్, నడుచుకుంటు తన పనులు కోసం వెళ్తున్న వారిని సైతం పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి బస్సుల్లో ఎక్కించారు. తాము..నిరసన కోసం రాలేదు మోర్రో.. అన్న కూడా అక్కడి పోలీసులు విన్పించుకోలేదు. ఇంకా మెట్రోల్లో, బస్సుల్లో యూత్ లు ఎక్కకుండా.. ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో చాలా చోట్ల నిరసన కారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ముఖ్యంగా నిరుద్యోగులు.. ప్రధానంగా మూడు డిమాండ్లతో ముట్టడికి పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది.


గ్రూప్ 2,3 పోస్టులు పెంచి, డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహించాలని,  డీఎస్సీని మూడు నెలలు వాయిదా వేసి, అక్టోబర్‌లో 25,000 పోస్టులతో మెగా డీఎస్సీ పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే గ్రూప్ 1లో 1:100ను అమలుపరచాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే పలు మార్లు నిరుద్యోగులు తమ నిరసనలను తెలియజేశారు. దీంతో టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జగరకుండా ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించారు. విద్యార్థులను ఎక్కడిక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను, మోతీలాల్ లను  పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


టీజీపీఎస్సీ ఆఫీస్ ముందు ఇనుప కంచెలు అచ్చం బాహుబలి సినిమాలో మాదిరిగా ఉన్నాయి. నిరుద్యోగుల నిరసలనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.  మరో వైపు ఈ ఘటనపై బీఆర్ఎస్ మాజీ మంత్రి  హరీష్ రావు స్పందించారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వారిని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి హమీలు ఇచ్చి మాటతప్పాయంటూ తీవ్రంగా విమర్శించారు. మరోవైపు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సైతం ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఒక వైపు ప్రజా పాలన అని ప్రచారం చేసుకుంటూ... నిరుద్యోగుల గొంతులను, హక్కులను అణగదొక్కే కుట్రలకు రేవంత్ సర్కారు పాల్పడుతుందని ఆరోపించారు.


Read more: Snake bite: ఇదేక్కడి విడ్డూరం..వ్యక్తిని కాటు వేసి.. చనిపోయిన పాము.. అసలు కథ మాములుగా లేదుగా..


ఇది ముమ్మాటికీ ప్రజాపాలన కాదని ‘అప్రజాస్వామ్యపాలన’ అని ఉద్యోగాల కోసం పుస్తకాలు పట్టుకొని చదవాల్సిన విద్యార్థులను నడిరోడ్డుకు ఈడ్చి ధర్నాలు, ఆందోళనలు చేసే దుస్థికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖం తిప్పుకుంటే విద్యార్థులకు నిరుద్యోగులకు తోడు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు వదిలిపెట్టమన్నారు. బేషరతుగా.. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, నిరుద్యోగుల అరెస్టులను నిలిపివేయాలని, నిర్బంధించిన వారిని, అరెస్టులు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు అన్నారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి