కంచె ఐలయ్య రాసిన పుస్తకం 'సామాజిక స్మగ్లర్లు - కోమటోళ్లు' పుస్తకాన్ని నిషేధించలేమని సుప్రీం ధర్మాసనం తెలిపింది. పుస్తకాన్ని నిషేధించడం అంటే భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకున్నట్లే అని త్రిసభ్య ధర్మాసనం తేల్చి చెప్పింది. ఐలయ్య రాసిన పుస్తకంపై నిషేధం విధించాలని  సుప్రీం కోర్టు న్యాయవాది కె ఎల్ ఎన్ వి వీరాంజనేయులు పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం "ఒక వ్యక్తి తన భావాలను వ్యక్తపరచడం ప్రాథమిక హక్కు అని, రచయితకూ తన భావాలను వ్యక్తపరిచే హక్కు ఉంటుంది" అని పేర్కొని కేసు కొట్టేసింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హర్షం వ్యక్తం చేసిన ఐలయ్య..


సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై  ఐలయ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో కులాల చరిత్ర, సంస్కృతిపై  రాజ్యాంగబద్ధంగా పరిశోధనలు చేసే అవకాశం దక్కిందని, ఈ తీర్పు ద్వారా మరిన్ని రచనలు చేసే అవకాశం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు.