Rain Alert: తెలంగాణ ప్రజలను వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. రాగల మూడురోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చిరుజల్లులు కురుస్తున్నాయి. ఈక్రమంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న ఐదురోజులపాటు ఏ ఏ జిల్లాల్లో ఎంతమేర వర్షపాతం నమోదు అవుతుందో వెల్లడించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇవాళ జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. 


రేపు ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి , భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.


4వ రోజు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, జనగామ, సిద్దిపేట జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 5వ రోజు పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి జిల్లాల్లో పలు చోట్ల ఇదే వాతావరణం ఉండనుంది. 


మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దీంతో రాగల మూడురోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీనికి తోడుగా ఉత్తర-దక్షిణ ద్రోణి సైతం కేంద్రీకృతమైంది. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో చిరుజల్లులు కురుస్తున్నాయి. 




Also read:Akasa Air: త్వరలో అందుబాటులోకి మరో విమాన సంస్థ..బుకింగ్ సర్వీసులు షురూ..!


Also read:CBSE 10th Results: సీబీఎస్‌ఈ పది ఫలితాలు విడుదల..రిజల్ట్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook