Lathi charge at Gurrambodu thanda during protest by BJP: సూర్యాపేట: మఠంపల్లి మండలం గుర్రంబోడు తండాలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు భూనిర్వాసితులైన గిరిజనులకు గుర్రంబోడులోని 540 వ సర్వే నెంబర్‌లో దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వం భూములు కేటాయించింది. 1,876 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూములను TRS నేత, Huzurnagar MLA Saidi Reddy, రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇతర నేతలు ఎవరికి తోచినంత వారు అక్రమించారని స్థానిక గిరిజనులు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో అక్కడ అన్యాయానికి గురైన గిరిజనులకు అండగా తాము ఉన్నామని భరోసా ఇవ్వడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం గుర్రంబోడు తండాలో గిరిజన భరోసా యాత్ర ( Girijana bharosa yatra ) పేరిట యాత్ర నిర్వహించి అక్కడ పర్యటించారు. బండి సంజయ్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రం నలుమూలల నుంచి BJP శ్రేణులు గుర్రంబోడుకు చేరుకున్నాయి. ప్రభుత్వానికి, తమ భూములను ఆక్రమించిన వారికి వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటానికి మద్దతు పలికేందుకు వచ్చిన బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay కి గిరిజనులు ఘన స్వాగతం పలికారు. 


ఈ పర్యటనలో భాగంగా ఆక్రమణకు గురైన భూముల్లో గిరిజనులతో కలిసి బండి సంజయ్ పర్యటించారు. ఈ నేపథ్యంలో భారీ మొత్తంలో అక్కడకు చేరుకున్న గిరిజనులు.. తమ భూములను ఆక్రమించిన చోట వెలసిన భారీ రేకుల షెడ్డును ఆగ్రహంతో నేలమట్టం చేసేందుకు ప్రయత్నించారు. రవీందర్ రెడ్డికి చెందినదిగా చెబుతున్న రేకుల షెడ్డును గిరిజనులు కూల్చేందుకు ప్రయత్నిస్తుండగా... అప్పటికే భారీ మొత్తంలో అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, గిరిజనులు వెనక్కి తగ్గకపోవడంతో వారిపై పోలీసులు Lathi charge చేశారు. పోలీసుల తీరుతో మరింత ఆగ్రహం చెందిన గిరిజనులు.. పోలీసులపై తిరుగుబాటు చేస్తూ వారిపైకి రాళ్లు రువ్వడం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. 


Also read : Telangana: ముఖ్యమంత్రి మార్పు లేదు..వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు.. TRS MLAs కి CM KCR warning


గిరిజనులు పోలీసులపైకి రాళ్లు రువ్వుతున్న సమయంలో అక్కడే ఉన్న బండి సంజయ్ వారిని వారించారు. అవసరం అయితే పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తినడానికైనా సిద్ధమే కానీ వాళ్లపైకి రాళ్లు రువ్వొద్దు అని Bandi Sanjay పిలుపునిచ్చారు. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో అటు గిరిజనులు, ఇటు పోలీసుల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. Police lathi charge లో పదుల సంఖ్యలో గిరిజనులు, పలువురు బీజేపి కార్యకర్తలు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం Gurrambodu thanda లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook