MLAs Jump: ఎమ్మెల్యేల చేరికతో కాంగ్రెస్‌లో కలకలం.. రేవంత్ తీరుతో సీనియర్ నాయకుడు రాజీనామా?
Jeevan Reddy Ready To Resign: సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడినా కూడా రేవంత్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపుతోంది. రేవంత్ ఒంటెద్దు పోకడ ధోరణి ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తులకు దారి తీస్తోంది. త్వరలో ఓ సీనియర్ నాయకుడు రాజీనామా చేయనున్నారని టాక్.
Telangana Politics: తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు గుర్తింపు ఉంది. పదేళ్ల అనంతరం తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఆ పార్టీ సుస్థిరమైన సంఖ్యతో అధికారంలోకి వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి సంఖ్యా బలం తగినంత ఉన్నా కూడా ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకుంటున్నారు. గులాబీ పార్టీని దెబ్బతీయాలనే పట్టుదలతో రేవంత్ వేస్తున్న అడుగులు సొంత పార్టీలో చిచ్చు రేపుతోంది. హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలో రేవంత్ నిర్ణయాలు బెడిసికొట్టేలా కనిపిస్తున్నాయి. సీనియర్ నాయకుడు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికతో ఆ పార్టీలో మరింత చిచ్చు రేపింది. రేవంత్ ఒంటెద్దు పోకడలా దూకుడు కనబరుస్తుండడంతో అతడి తీరుపై సీనియర్ నాయకులు మండిపడుతున్నారు.
Also Read: KTR: ఎమ్మెల్యేల జంప్ జిలానీలపై కేటీఆర్ సంచలన ట్వీట్.. మాస్ వార్నింగ్
ఏం జరుగుతోంది?
పార్టీలో ఏం జరుగుతుందో సీనియర్ నాయకులకు తెలియకుండా రేవంత్ ముందుకు వెళ్తుండడంతో త్వరలోనే పార్టీలో చిచ్చు రేపే అవకాశాలు ఉన్నాయి. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అతడి కుమార్తె కడియం కావ్య చేరికతో వరంగల్‌లో విబేధాలు వచ్చాయి. వరంగల్ మేయర్ గుండు సుధారాణి చేరిక కూడా వివాదాస్పదమైంది. పోచారం చేరికతో బాన్సువాడ నియోజకవర్గంలో అసంతృప్తులు బయటపడ్డాయి. బహిరంగంగానే పోచారం రాకను పార్టీ శ్రేణులు వ్యతిరేకించారు. హైదరాబాద్‌లో దానం నాగేందర్ చేరిక కూడా రోహిణ్ రెడ్డి, పి విజయా రెడ్డి వర్గంలో అసంతృప్తి ఉంది. కానీ ఇంకా బయటపడలేదు. పట్నం మహేందర్ రెడ్డి దంపతుల చేరిక కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో దుమారం రేపింది.
Also Read: Sanjay Kumar: బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఐదో వికెట్ డౌన్.. కాంగ్రెస్‌లోకి జగిత్యాల ఎమ్మెల్యే
ముఖ్యంగా నిజమాబాద్ జిల్లాలో పార్టీ ఫిరాయింపులు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. ఆ జిల్లాలో సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉన్నారు. ఇటీవల నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిని చవిచూశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే పరిణామం ఏర్పడింది. అయితే తాజాగా రేవంత్ రెడ్డి ఇదే లోక్‌సభ నియోజకవర్గంలో ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పోచారం, సంజయ్‌ను చేర్చుకున్నారు.
నిజామాబాద్ లో కాక
మూడు రోజుల కిందట పోచారం, నిన్న సంజయ్ చేరికతో జీవన్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. తనకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి ఇలా వ్యవహరిస్తున్నారని భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కూడా పరోక్షంగా తన ఓటమికి రేవంత్ కుట్ర పన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడినా తనకు ఒక్క పదవి ఇవ్వలేదు. పార్టీలో పదవి కూడా దక్కలేదు. తన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తుండడంతోనే రేవంత్ తనపై కుట్ర రాజకీయాలు చేస్తున్నాడని జీవన్ రెడ్డి భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే జగిత్యాలలో తనను ఓడించిన సంజయ్‌ను చేర్చుకునే విషయాన్ని స్థానిక నాయకుడినైన తనను సంప్రదించకపోవడంపై జీవన్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. పోచారం విషయం కూడా తనకు చెప్పకపోవడం ఆగ్రహం తెప్పించింది. ఇద్దరు ముఖ్యమైన నాయకులను చేర్పించుకునే క్రమంలో ఒక మాట కూడా చెప్పకపోవడంపై మండిపడుతున్నారు. దీంతో రేవంత్‌పై జీవన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. త్వరలోనే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే అవకావం ఉందని జీవన్ అనుచరులు చెబుతున్నారు.
పార్టీలో పోచారం చేరిన సమయంలో జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. 'రాజకీయాల్లో ప్రతి రాజకీయ పార్టీ వారి సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేయాలి. పోరాటం చేయాలి. రాష్ట్రంలో ఇప్పటికే 65 మంది ఎమ్మెల్యేలతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. ఫిరాయింపులను ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవాల్సిన పని లేదు' అని పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter