హైదరాబాద్: రేవంత్ రెడ్డి నివాసంలో ఐటీ సోదాలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి  స్పందించారు. ఐటీ దాడులు దారణమన్నఆయన... కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఓటమి భయంలో కేసీఆర్ ఇలాంటి పిరికి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తమను ప్రత్యక్షంగా ఎదుర్కొలేక దొంగదెబ్బతీయాలను భావించడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు.  కాంగ్రెస్ నేతలను ఇబ్బంది పెట్టేందుకు  ప్రభుత్వ సంస్థలను కేసీఆర్ వాడుకుంటున్నారని విమర్శించారు.


నిన్న జగ్గారెడ్డి, నేడు రేవంత్ రెడ్డి... ఈ చర్యలు కేసీఆర్ పిరికి తనానికి నిదర్శనమని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రజలు నిరంకుశ పాలన నుంచి బయటపడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ప్రభుత్వ కక్ష సాధింపుకు ఎవరూ భయపడే ప్రసక్తే లేదని.. ఐక్యంగా ఉంటూ కేసీఆర్ పాలనపై పోరాడతామని ఈ సందర్భంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.