తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జీహెచ్ ఎంసి ఎన్నికలపై ( GHMC Elections ) కీలక వ్యాఖ్యాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో మొత్తం 150 సీట్లలో 104 సీట్లను కైవసం చేసుకుంటుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read |Telangana: ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ గడువు పెంపు


ఆదివారం రోజు మీడియాతో మాట్లాడిన తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav ) వరద ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన హైదరాబాద్ (Hyderabad) కోసం కేంద్రం వెంటనే రూ.1,000 కోట్లు సహయం చేయాలి అని ఆయన కోరారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజలకు అన్నిరకాల సహాయం అందుతుంది అని తెలిపారు తలసాని. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల గురించి మాట్లాడిన ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్, బీజేపీ వద్ద సరైన అభ్యర్థులు లేరు అని అన్నారు.



Also Read | Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు 50 శాతం Cashback


ఎన్నికలు ఏవి అయినా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ( TRS ) విజేతగా నిలుస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. గోబెల్స్ ప్రచారంతో దుబ్బాక ఎన్నికలను గెలవడానికి బీజేపి ప్రయత్నిస్తోంది అని వ్యాఖ్యానించారు తలసాని. 


సోమవారం రోజు దుబ్బాక బై ఎలక్షన్స్ జరగనుంది. ఫలితాలను నవంబర్ 10వ తేదీని ప్రకటించనున్నారు.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR