పబ్‌కి వెళ్లడమే తప్పు అన్నట్టుగా.. నిహారికపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: తమన్నా
Tamanna Simhadri on Niharika Drug Case. ఎవరో ఒకరు తప్పుచేస్తే పబ్‌కి వెళ్లిన అందరిని దొంగల్లాగా చూస్తున్నారు అని ట్రాన్స్‌జెండర్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి అన్నారు. పబ్‌కి వెళ్లడమే పెద్ద తప్పు అన్నట్టుగా మెగా డాటర్ నిహారిక కొణిదలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Tamanna Simhadri reacts on Niharika Konidela's Pub Incident: ఎవరో ఒకరు తప్పుచేస్తే పబ్‌కి వెళ్లిన అందరిని దొంగల్లాగా చూస్తున్నారు అని ట్రాన్స్‌జెండర్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి అన్నారు. పబ్‌కి వెళ్లడమే పెద్ద తప్పు అన్నట్టుగా మెగా డాటర్ నిహారిక కొణిదలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిహారిక కేవలం ఫ్రెండ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం పబ్‌కి వెళ్లిందని, ఆమెది ఎటువంటి తప్పు లేదని తమన్నా పేర్కొన్నారు. తమన్నా తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. రాడిసన్ ఘటనపై స్పందించారు.
'పబ్‌కి వెళ్లడం పెద్ద తప్పు అన్న విధంగా నిహారిక కొణిదలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎవరో ఒకరు తప్పు చేస్తే.. పబ్‌కి వెళ్లిన అందరిని దొంగల్లాగా చూస్తున్నారు. నిహారిక తన ఫ్రెండ్ బర్త్‌డే సెలెబ్రేషన్స్ కోసం పబ్‌కి వెళ్లారు. ఆమె బర్త్‌డే పార్టీలో ఉన్నారు. అక్కడికి వెళ్లిన అందరిని వదిలేసి.. నిహారికని టార్గెట్ చేసి మీడియా, యూట్యూబ్‌లో స్టోరీస్ వేస్తున్నారు. ఇది చాలా దారుణం' అని తమన్నా సింహాద్రి అన్నారు.
'నిహారిక డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు ఎక్కడా చెప్పలేదు. పోలీసులు దాడి చేసిన సమయంలో చాలా మంది పారిపోయారు కూడా. ఇక నిహారిక ఫ్యామిలీ విషయాలపై మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ అభిమానులుగా ట్రోల్ చేసిన వారిని అడ్డుకుంటాం' అని ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి చెప్పారు.
ఇటీవల బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో జరిగిన ఘటన అందర్నీ షాక్‌కి గురి చేసిన విషయం తెలిసిందే. సమయానికి మించి పబ్‌ను రన్ చేస్తుండడంతో.. సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి పలు రకాల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో పబ్ యజమానులు సహా సుమారు 157 మందిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పబ్‌లో చాలా మంది ప్రముఖుల పిల్లలు ఉండటంతో ఈ సంఘటన బాగా వైరల్ అయింది. ఆ ప్రముఖుల్లో మెగా డాటర్ నిహారిక కూడా ఉండటంతో సోషల్ మీడియాలలో, యూట్యూబ్‌లో ఈ వార్త బాగా హైలేట్ అయింది.
Also Read: Petrol Diesel Price Hike: ఆగని పెట్రో బాదుడు.. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook