Chandrababu:ఖమ్మంలో టీడీపీ భారీ బహిరంగ సభ.. తెలంగాణలో చంద్రబాబు వ్యూహమేంటో?
Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తెలంగాణపై ఫోకస్ చేశారు. కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపని చంద్రబాబు.. తాజాగా పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. తెలంగాణలో ప్రస్తుతం ప్రధాన పార్టీలన్ని దూకుడు పెంచాయి. పోటాపోటీ కార్యక్రమాలతో జనంలోకి వెళుతున్నాయి. పార్టీలు నేతల, దూకుడుతో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.
Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తెలంగాణపై ఫోకస్ చేశారు. కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపని చంద్రబాబు.. తాజాగా పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. తెలంగాణలో ప్రస్తుతం ప్రధాన పార్టీలన్ని దూకుడు పెంచాయి. పోటాపోటీ కార్యక్రమాలతో జనంలోకి వెళుతున్నాయి. పార్టీలు నేతల, దూకుడుతో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. 2018 తరహాలోనే కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారంతో విపక్ష పార్టీలు నిత్యం జనంలో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. సర్వేలు చేస్తూ తమ పార్టీ పరిస్థితిని బేరీజు వేసుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపికపైనా కసరత్తు చేస్తున్నాయి. తాజాగా తెలంగాణ సీన్ లోకి టీడీపీ అధినేత చంద్రబాబు ఎంటరయ్యారు. వరద ప్రభావిత గ్రామాల పర్యటనలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు చంద్రబాబు.
ఏలూరు జిల్లాలో మీదుగా భద్రాద్రి జిల్లాలో పర్యటించిన చంద్రబాబు గురువారం రాత్రి భద్రాచలంలో బస చేశారు. శుక్రవారం ఉదయం భద్రాచలం రామయ్యను దర్శించుకున్నారు. అనంతరం గోదావరి ముంపు ప్రాంతాల్లో తిరిగారు. గోదావరి వరద నుంచి భద్రాచలంను కాపాడిన కరకట్టను పరిశీలించారు చంద్రబాబు. 2003లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా గోదావరికి భారీగా వరదలు వచ్చి భద్రాచలం నీట మునిగింది. ఆ తర్వాత గోదావరికి కరకట్ట కట్టారు. అప్పుడు కట్టిన కరకట్ట వల్లే ఈసారి రికార్డ్ స్థాయిలో వరద వచ్చినా భద్రచాలం సేఫ్ గా ఉందని అంటున్నారు. అందుకే తన హయాంలో నిర్మించిన కరకట్టను పరిశీలించిన చంద్రబాబు.. స్థానికులతో మాట్లాడారు, తర్వాత ఖమ్మం మరియు మహబూబ్ బాద్ లోక్ సభ టీడీపీ కమిటీలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు. తెలంగాణలో టీడీపీకి అద్భుతమైన స్పందన ఉందన్నారు చంద్రబాబు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీకి అనుకూల వాతావరణం ఉందన్నారు. పార్టీకి నూతన ఉత్తేజం వచ్చిందన్నారు. సెప్టెంబర్ రెండవ వారంలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చంద్రబాబు ప్రకటించారు.
తెలంగాణపై చంద్రబాబు ఫోకస్ చేయడం వెనుక బలమైన కారణమే ఉందంటున్నారు. తెలంగాణలో ప్రస్తుతం బహుముఖ పోటీ నెలకొంది. అధికార టీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అంటున్నాయి కాంగ్రెస్, బీజేపీలు. వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు. బీఎస్పీ కన్వీరన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జోరుగా తిరుగుతున్నారు. ఈ రెండు పార్టీలకు కొంత ఓటు బ్యాంక్ వస్తుందని వివిధ సర్వేలు చెబుతున్నారు. తీన్మార్ మల్లన్న వంటి నేతలు పోటీలో ఉండనున్నారు. జనసేన కూడా తెలంగాణలో పోటీ చేస్తామని ప్రకటించింది. హైదారాబాద్ లో ఎంఐపార్టీ ఉండనే ఉంది. దీంతో తెలంగాణలో ఈసారి హంగ్ ఫలితాలు వస్తాయనే అంచనాలో ఉన్నారట చంద్రబాబు. హంగ్ వస్తే చిన్న పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఓ ఐదారు సీట్లు వచ్చినా ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్ కావచ్చనే అంచనాతోనే తెలంగాణపై చంద్రబాబు ఫోకస్ చేశారని చెబుతున్నారు.
టీడీపీకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టు ఉంది. ఖమ్మం జిల్లా అంధ్రా ఓటర్లు భారీగానే ఉన్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ దాదాపు 10 నియోజకవర్గాల్లో సెటిలర్లే కీలకం. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికలకు సిద్దం చేయాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారంటున్నారు. సెప్టెంబర్ లో ఖమ్మంలో సభ తర్వాత గ్రేటర్ లో మరో బహిరంగ సభకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. మొత్తంగా ఓ ఐదారు సీట్లు గెలిచినా ప్రభుత్వ ఏర్పాటులో కీ రోల్ పోషించవచ్చన్న అంచనాతోనే తెలంగాణపై చంద్రబాబు ఫోకస్ చేశారని అంటున్నారు.
Also Read: Praveen: చీకోటి ప్రవీణ్ తో లింకులున్న నేతలు వీళ్లేనా? క్యాసినో దందా చీకటి కోణాలు ఇవిగో...!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook