Nara Lokesh Yuva Galam Padayatra: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం ఎస్.అన్నవరం సాయివేదిక వద్ద కాపు సామాజికవర్గం ప్రతినిధులతో టీడీపీ నేత నారా లోకేష్‌ ముఖాముఖి సమావేశం నిర్వహించారు. కాపు ప్రతినిధులు మాట్లాడుతూ.. కాపులకు టీడీపీ ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్లు సీఎం జగన్ రద్దు చేశారని.. తమను ఆదుకోవాలని కోరారు. కాపు కళ్యాణ మండపాలు, కాపు భవనాలు లేక ఇబ్బంది పడుతున్నామన్నారు. జగన్ పాలనలో కాపు కార్పొరేషన్ ని నిర్వీర్యం చేశారని.. ఒక్క రుణం కూడా ఇవ్వలేదన్నారు. ఏడాదికి రూ.2 వేల కోట్లు ఇస్తానని మోసం చేశారని.. కనీసం కార్పొరేషన్ లో కుర్చీ, టేబుల్ లేని పరిస్థితి నెలకొందని వివరించారు. అమ్మ ఒడి, పెన్షన్ లాంటి సంక్షేమ పథకాలు తమ ఖాతాలో రాస్తున్నారని అన్నారు. కాపులకు రాజకీయంగా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనంతరం నారా లోకేష్ మాట్లాడుతూ.. కాపులకు కష్టపడే తత్వం ఉందని.. మీరు కష్టాన్ని నమ్ముకున్న వారని అన్నారు. టీడీపీ కాపులను ఆర్థికంగానూ, రాజకీయంలోనూ ప్రోత్సహించిందన్నారు. కాపులకు ఇచ్చిన ప్రతి హామీని చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నారని చెప్పారు. టీడీపీ కాపులకు కార్పొరేషన్ పెట్టిందని.. వారి సంక్షేమ కోసం రూ.3 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. కాపు విద్యార్థులకు విదేశీ విద్య పథకం ద్వారా రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల ఆర్ధిక సాయం చంద్రబాబు అందించారని అన్నారు. 


"కాపులకు కీలక పదవులు  ఇచ్చింది టీడీపీ మాత్రమే. బీసీలకు ఇబ్బంది లేకుండా కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది టీడీపీ. జగన్ కాపులను నమ్మించి ద్రోహం చేశారు. కార్పొరేషన్‌కి ఏడాదికి 2 వేల కోట్లు 5 ఏళ్లలో 10 వేల కోట్లు అన్నాడు.. ఐదేళ్లలో కనీసం కార్పొరేషన్ ద్వారా 10 రూపాయిలు ఇవ్వలేదు. జగన్ కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేశాడు. జగన్ కాపుల రిజర్వేషన్లు రద్దు చేశాడు. తుని ఎమ్మెల్యే మాయా రాజా కాపులకు అన్యాయం జరుగుతున్నా ఏనాడూ జగన్‌ను ప్రశ్నించలేదు. జగన్ విదేశీ విద్య రద్దు చేశాడు. ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యే వారికి ఇచ్చే ఆర్ధిక సాయాన్ని కూడా రద్దు చేశాడు. కాపుల కోసం కాపు భవనాలు, కళ్యాణ మండపాలు కట్టింది టీడీపీ. జిల్లా స్థాయిలో 5 కోట్లు, నియోజకవర్గం స్థాయిలో ఒక కోటి రూపాయలతో కాపు భవనాలు ఏర్పాటు చేసింది.


టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే దామాషా ప్రకారం కాపు భవనాలు, కళ్యాణ మండపాలు ఏర్పాటు చేస్తాం.. టీడీపీ హయాంలో ప్రారంభించిన కాపు భవనల నిర్మాణం ఆపేసింది. దాడిశెట్టి రాజా అక్రమాలు అన్ని ఇన్ని కావు.. జర్నలిస్ట్ హత్య, శేషగిరిపై దాడి, అక్రమాలపై సీబీఐ కేసు వేసి శిక్ష పడేలా చేస్తాం. తునిలో జరిగిన భూ దందా, ఇసుక అక్రమాలు, అవినీతిపై విచారణ జరిపి వడ్డీతో సహా మాయా రాజాతో కట్టిస్తాం.. మన అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశీ విద్య పథకం అమలు చేస్తాం. కాపులకు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంది టీడీపీ. కాపులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోనిది జగన్. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే కాపు కార్పొరేషన్‌ను బలోపేతం చేస్తాం.


మన ప్రభుత్వం వచ్చిన వెంటనే కాపులను మరింతగా రాజకీయంగా ప్రోత్సహిస్తాం. గతంలో టీడీపీ బీసీలకు ఇబ్బంది లేకుండా కాపులకు కల్పించిన 5 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యేలా చూస్తాం. గతంలో చేసిన తీర్మానానికి కట్టుబడి ఉన్నాం. జగన్ కులాల మధ్య చిచ్చు పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నాడు. మూడు నెలల్లో సైకో ప్రభుత్వం పోతుంది. ప్రజా ప్రభుత్వం వస్తుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలకి కూడా తీరని ద్రోహం చేసింది జగన్.." అని నారా లోకేష్ అన్నారు.


జగన్ చంపేసిన స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను మన ప్రభుత్వం వచ్చిన వెంటనే బలోపేతం చేస్తామన్నారు. జగన్ ప్రభుత్వం రూ.12 లక్షల కోట్లు అప్పుచేసి రాష్ట్రాన్ని ముంచేసిందన్నారు. కేవలం ప్రతి ఏడాది వడ్డీనే లక్ష కోట్లు అవుతుందన్నారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితి చూసి టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని ముందుకొచ్చారని అన్నారు. టీడీపీ-జనసేన జోడీ బ్లాక్ బస్టర్ జోడి అని.. ప్రజల కోసం రాష్ట్రం కోసం టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకున్నట్లు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్‌ను రాష్ట్రంలో అడుగు పెట్టకుండా అడ్డుకుందని.. చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టారని అన్నారు.


Also Read:  Alla Ramakrishna Reddy: వైసీపీకి బిగ్‌షాక్.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా


Also Read:  Allu Arjun: హాయ్ నాన్న రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్.. నానిపై ప్రశంసలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి