Teacher Jobs 2021: తెలంగాణలో టీచర్ పోస్టులు, మే 10న ముగియనున్న తుది గడువు, నోటిఫికేషన్ వివరాలు
Teacher Jobs 2021: ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యూకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TSTWREIS) పలు టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల భర్తీకి ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నోటిఫికేషన్ జారీ చేసింది.
Teacher Jobs 2021: తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యూకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TSTWREIS) పలు టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, కంప్యూటర్ టీచర్, ఆర్ట్ టీచర్, కౌన్సెలిర్ పోస్టుల భర్తీకి ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నోటిఫికేషన్ జారీ చేసింది.
టీటీడబ్ల్యూఆర్ సైనిక్ స్కూల్ (బీ), అశోక్ నగర్ వరంగల్, టీఎస్‌డబ్ల్యూఆర్ సైనిక్ స్కూల్ రుక్మాపూర్ (బీ), కరీంనగర్.. 6వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ సిలబస్ బోధించడానికి ఉపాధ్యాయ ఖాళీలను(TSTWREIS JOBS) భర్తీ చేస్తున్నారు. 60 శాతం మార్కులతో బీఎడ్ పాస్ అయిన వారు అర్హులు. అయితే అభ్యర్థులు కచ్చితంగా సీటెట్ లేదా టెట్‌లలో ఏదో ఒకటి అర్హత సాధించిన వారై ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
Also Read: AP Jobs 2021: ఏపీలో హెల్ప్ డెస్క్ మేనేజర్ పోస్టులు, పూర్తి వివరాలు మీకోసం
పోస్టులు మరియు ఖాళీల వివరాలు ఇవే..
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) – 26 Posts
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) – 14 Posts
కౌన్సెలర్ – 02 Posts
కంప్యూటర్ టీచర్ – 01 Posts
Computer Teacher, Art Teacher – 04 Posts
చివరి తేదీ – మే 10, 2021
రాతపరీక్ష తేదీ – మే 24, 2021
ఇంటర్వ్యూ మరియు డెమో – జూన్ 9, 2021
ఫైనల్ ఎంపికైన వారి జాబితా – జూన్ 16, 2021
TSTWREIS జాబ్స్ 2021 నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి
వేతనం: టీజీటీ ఉపాధ్యాయులకు నెలకు రూ. 30,000 కాగా, పీజీటీ ల్యాంగ్వేజ్ ఫ్యాకల్టీకి రూ.30,000 ఆప్షనల్ సబ్జెక్టులకు రూ.40,000 వేతనం అందించనున్నారు. వీరితో పాటు కంప్యూటర్ టీచర్, ఆర్ట్ టీచర్, కౌన్సెలర్‌లకు రూ.20,000 వేతనాన్ని అందించనున్నట్లు నోటిఫికేషన్‌లో తెలిపారు.