Teenmar Mallanna Arrest at Jangaon: ప్రముఖ జర్నలిస్టు, క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నకు ఊహించని షాక్ తగిలింది. వరంగల్‌లో రైతులకు మద్దతుగా వెళ్తున్న మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం జనగామ జిల్లా లింగాల గణపురం పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి.. స్టేషన్‌కు తరలించారు. రైతులకు మద్దతుగా వెళ్తున్న తీన్మార్ మల్లన్నను ముందస్తుగా ప్రివెంటివ్ అరెస్టు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతకొంత కాలంగా వరంగల్‌లో లాండ్ పూలింగ్ రియల్ మాఫియా జరుగుతున్న నేపథ్యంలో క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న అక్కడి లైవ్ ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం (మే 10) వరంగల్‌కు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఈరోజు తెల్లవారు జామున 5.30 గంటలకు జనగామ జిల్లాకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆయనను ప్రివెంటివ్ అరెస్ట్ చేశారు. ఈ సమయంలో తీన్మార్ మల్లన్న, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకునట్లు తెలుస్తోంది. ఇక తీన్మార్ మల్లన్నను అరెస్టు చేసిన అనంతరం లింగాల గణపురం పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది.


ఇటీవల బీజేపీ పార్టీపై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 'తెలంగాణ రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న దొంగల ముఠా సభ్యుల సంఖ్య 7200. తెలంగాణ ఆస్తులను కొల్లగొడుతున్న వారి సంఖ్య 7200. రాష్ట్ర ప్రజల రక్తం తాగుతున్న వారి సంఖ్య 7200. అందుకే మల్లన్న టీమ్ 7200 పేరుతో నేను ఉద్యమం చేస్తున్నా. నేను ఏర్పాటు చేసిన ఈ టీమ్.. బీజేపీ కన్నా లక్ష రెట్లు బెటర్' అని అన్నారు. ఇక నుంచి తాను బీజేపీ పార్టీ ఆఫీసుకు వెళ్లబోనని స్పష్టం చేశారు. త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు చెప్పుకొచ్చారు. 


Also Read: Surya kumar Yadav: ముంబై టీమ్‌కు షాక్..స్టార్ ప్లేయర్ ఔట్..!


Also Read: Sonakshi Sinha Engagement: వైరల్ ఫొటోస్.. ఎంగేజ్‌మెంట్ రింగ్‌తో సోనాక్షి సిన్హా!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook