Teenmar Mallanna Arrest News: తీన్మార్ మల్లన్నను మంగళవారం సాయంత్రం అరెస్ట్ చేసిన మేడిపల్లి పోలీసులు ఎట్టకేలకు బుధవారం మధ్యాహ్నం తరువాత మల్లన్న అరెస్ట్ పై ఎఫ్ఐఆర్ ని విడుదల చేశారు. ఐపిసి సెక్షన్లు 148, 307, 342,506, 384, 109,r/w 149 కింద మొత్తం కేసు నమోదు చేసినట్టు మేడిపల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీలో పేర్కొన్నారు. ఉగాది పండగ సందర్భంగా బుధవారం పబ్లిక్ హాలీడే కావడంతో తీన్మార్ మల్లన్నను హయత్ నగర్‌లోని జడ్జి నివాసంలో జడ్జి ఎదుట హాజరు పరిచారు. ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించిన జడ్జి.. తీన్మార్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్ విధించారు. జడ్జి ఆదేశాలతో పోలీసులు తీన్మార్ మల్లన్నను చర్లపల్లి జైలుకు తరలించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎఫ్ఐఆర్ కాపీలో పేర్కొన్న వివరాల ప్రకారం... రావనకల్ సాయి కరణ్ గౌడ్ అనే యువకుడి ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు చేసినట్టు స్పష్టం అవుతోంది. తాను 19.03.2023 ఆదివారం నాడు మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో క్యూ న్యూస్ కార్యాలయానికి వెళ్లానని.. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీపై తప్పుడు, అసత్య ప్రచారం ఎందుకు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించగా.. క్యూ న్యూస్ సిబ్బంది తనను నిర్భందించి, విచక్షణారహితంగా కర్రలతో కొట్టారని, దూషించారని సాయి కరణ్ గౌడ్ తన ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా పోలీసులు తెలిపారు. 


తనపై దాడికి పాల్పడి దూషించడమే కాకుండా.. తన జేబులో ఉన్న నగదు, మెడలోని చైన్, చేతికున్న ఉంగరాన్ని బలవంతంగా లాక్కున్నారని.. అదే సమయంలో పోలీసులు రావడంతో తాను ప్రాణాలతో బయటపడ్డానని సాయి కరణ్ ఫిర్యాదు చేసినట్టుగా మేడిపల్లి పోలీసులు తీన్మార్ మల్లన్నపై నమోదైన కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలో పేర్కొన్నారు.


ఇది కూడా చదవండి : Minister KTR Tweet: మంత్రి కేటీఆర్ వర్సెస్ బండి సంజయ్.. ఉగాది పంచాంగం చెబుతూ ట్విట్టర్ వార్


ఇది కూడా చదవండి : Teenmar Mallanna: కేసీఆర్.. నీకు మూడింది.. నీ గొయ్యిని నువ్వే తవ్వుకుంటున్నవ్ బండి సంజయ్ హాట్ కామెంట్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK