Teenmar Mallanna Exclusive Interview: తీన్మార్ మల్లన్న... తెలంగాణలో పరిచయం అక్కర్లేని పేరు. అసలు పేరు చింతపండు నవీన్ అయినప్పటికీ.. తెర'పైకొచ్చిన' తీన్మార్ మల్లన్నగానే అందరికీ సుపరిచితం. పాత్రికేయ వృత్తిలోకి వచ్చి ఆ తర్వాత ప్రజాసేవ బాధ్యతను భుజానేసుకుని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తొలుత కాంగ్రెస్ పార్టీ తరపున.. ఆ తర్వాత స్వతంత్య్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఎన్నికల పోటీలో గెలవకపోయినప్పటికీ.. పోటీ చేసిన ప్రతీసారి తన బలాన్ని, ప్రాభవాన్ని పెంచుకుంటూ వస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని, అధికార పార్టీని ఎండగట్టడంలో ప్రతిపక్షాలతో పోటీపడే తీన్మార్ మల్లన్నకు అభిమానులు ఏ స్థాయిలో ఉన్నారో.. ఆ స్థాయిలోనే ఆయన్ని విమర్శించే వాళ్లూ ఉన్నారు. అయితే తనని విమర్శించే వాళ్లంతా టీఆర్ఎస్ పోషిస్తున్న పింకీ బ్యాచులే అంటారాయన.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Teenmar Mallanna Jail Life: ఈ క్రమంలోనే ఎన్నో కేసులు, అభియోగాలు, ఆరోపణలు ఎదుర్కొన్న తీన్మార్ మల్లన్నపై జనానికి కూడా ఎన్నో సందేహాలు. తీన్మార్ మల్లన్న తనని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు అంటూ లక్ష్మీకాంత్ శర్మ అనే ఓ జ్యోతిష్యుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన్ని విచారణ పేరుతో జైలులో పెట్టారు. ఇటీవలే ఈ కేసు నుంచి బెయిల్ పై విడుదలై బయటికొచ్చిన తీన్మార్ మల్లన్న ఇటీవలే బీజేపీలో చేరడం మనందరికీ తెలిసిందే. అయితే, ఇలాంటి కేసుల బారి నుంచి తప్పించుకోవడానికే బీజేపీలో చేరారని కొందరంటే.. బీజేపీలో చేరడం మల్లన్నకు ప్లస్ పాయింట్ అవుతుందా లేక మైనస్ పాయింట్ అవుతుందా అని ఇంకొన్ని కామెంట్స్ వినిపించాయి. ఇంతకీ ఈ జైలు జీవితంపై తీన్మార్ మల్లన్న అభిప్రాయం ఏంటి ?  


Interesting Facts About Teenmar Mallanna: బీజేపిలో చేరిన తీన్మార్ మల్లన్నకు అంతకంటే ముందు కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందలేదా ? టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో టచ్‌లో ఉన్నాను అని చెబుతున్న తీన్మార్ మల్లన్న మాటల్లో ఆంతర్యమేంటి ? 2023 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేస్తారా ? చేస్తే ఎక్కడి నుంచి బరిలో నిలబడతారు ? తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిలరా ? తీన్మార్ మల్లన్న కేసీఆర్‌ని బాతాల పోశెట్టి అని కడిగేయడమే పనిగా పెట్టుకోవడానికి కారణం ఏంటి ? అసలు తీన్మార్ మల్లన్న అంతిమ లక్ష్యం ఏంటి ? తీన్మార్ మల్లన్న హిందుత్వాన్ని ప్రోత్సహిస్తారా లేదా ? ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే పనిగా పెట్టుకున్నానని చెబుతున్న తీన్మార్ మల్లన్నను ఇవే ప్రశ్నలు అడిగితే ఏం చెబుతారు. 



 


Big Debate With Bharath: ఇవే కాదు.. ఇలాంటి ఇంకెన్నో సందేహాలకు స్వయంగా తీన్మార్ మల్లన్న నోటే సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు జీ తెలుగు న్యూస్ డిజిటల్ టీవీ ఎడిటర్ భరత్. ఎన్నో ఉత్కంఠరేపే ప్రశ్నలకు మల్లన్న వెల్లడించిన సంచలన విషయాలతో పాటు సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుపై తీన్మార్ మల్లన్న చేసిన సంచలన ఆరోపణలు ఏంటో తెలుసుకోవాలంటే ఇవాళ రాత్రి 7 గంటలకు జీ తెలుగు న్యూస్‌లో (Zee Telugu News Live Tv) తీన్మార్ మల్లన్నతో బిగ్ డిబేట్ విత్ భరత్ చూడాల్సిందే.


Also read : Polytechnic Question Papers Leak: పాలిటెక్నిక్ క్వ‌శ్చ‌న్ పేపర్స్ ముందే లీక్... వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోన్న ప్రశ్నాపత్రాలు!


Also read : Telugu Movies on OTT: ఈ వారం ఓటీటీలో స్ట్రీమ్‌ అవుతోన్న మూవీలు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook