Teenmar Mallanna: ధనిక,పేద వర్గాలను సమాన స్థాయికి తీసుకరావడమే తన అంతిమ లక్ష్యమన్నారు తీన్మార్ మల్లన్న.తెలంగాణ రాష్టానికి  పట్టిన తుప్పును దులపడానికే తన పోరాటమన్నారు. కరీంనగర్ జిల్లాలో తీన్మార్ మల్లన్న టీమ్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. తీన్మార్ మల్లన్న ఉద్యమంలో తాము కూడా మద్దతుగా ఉంటామంటూ  కరీంనగర్ జిల్లా నుంచి ముందుకు వచ్చిన సూమారు 2000 మంది ఈ సభకు హాజరయ్యారు. ఆ సందర్బంగా తన ప్రసంగంలో తన లక్ష్యాలు వివరించారు తీన్మార్ మల్లన్న. కేసీఆర్ ప్రభుత్వన్ని కూల్చడం ఎంత ముఖ్యమో.. ప్రజల కష్టాలను తీర్చే  ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కూడా అంతే ముఖ్యమన్నారు మల్లన్న. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్టంలోని గురుకుల పాఠశాలలో వానపాములు, బల్లులు, ఎలుకలు పడ్డ ఆహారం విద్యార్థులకు పెడుతున్నారని తీన్మార్ మల్లన్న మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతులు చెట్లకు వేలాడేదని.. ప్రస్తుతం విద్యార్థులు హాస్టల్ గదులల్లో ఫ్యాన్లకు ఉరి పెట్టుకొని వేలాడుతున్న పరిస్థితి దాపరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్య సంస్థలకంటే వైన్ షాపుల సంఖ్య ఎక్కువ ఉందని.. తాగుబోతులు రెండు రోజులు స్ట్రైక్ చేస్తే కేసీఆర్ గుండె పగులుతుందని ఎద్దేవా చేశారు. అడగని పథకాలు అమలు చేస్తూ.. అడిగిన చదువును కేసీఆర్ దూరం చేయాలని కుట్రలు చేస్తున్నారని తెలిపారు. బడికి,గుడికి కూడా కులాలు, మతాల రంగులు అద్దుతున్న ఈ రాజకీయ నాయకులకు తగిన బుధ్ది చెప్పాలన్నారు. తీన్మార్ మల్లన్న టీంలో కులాలు,మతాలు ఉండవు కేవలం ధనిక, పేద అనే వర్గాలు ఉంటాయన్నారు మల్లన్న. వాటిని సమ స్థాయికి తీసుకరావడమే తమ అంతిమ లక్ష్యమని అన్నారు.


ఎవరికి రోగం వచ్చిన సర్కార్ దవాఖానలో నాణ్యమైన వైద్యం ఉచితంగా అందించాలన్నదే తీన్మార్ మల్లన్న డిమాండ్  అన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు వారి పిల్లలకు అందుతున్న సౌకర్యాలు ప్రతి పేదోడికి అందించే వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు.  రాష్టంలో మేనిపిస్టో తామే తయారు చేస్తామని.. దానిని అమలు చేసే దమ్ము ఈ రాజకీయ పార్టీలకు ఉందా? అని ప్రశ్నించారు. తనకు, తనకు  కుటుంబ సభ్యుల మీద ఉన్న ఆస్తులను ప్రభుత్వానికి రాసిచ్చి రాజకీయాల్లోకి వస్తా, అలా వచ్చే సాహసం ఎవరైనా చేస్తారా అని సవాల్ చేశారు. అవినీతి చేసి దొరికిన రాజకీయ నాయకులకు మళ్ళీ పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదని,హామీలు ఇచ్చి అమలు చేయని నాయకులను సంవత్సర కాలంలోనే రీకాల్ చేసే అధికారం ప్రజలకు ఉండాలని అన్నారు. ప్రతి ఒక్కరు మరో తీన్మార్ మల్లన్నగా తయరై ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలని కోరారు తీన్మార్ మల్లన్న.


Read Also: Tirumala Temple:తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులుఆలయం మూసివేత 


Read Also: Hyderabad Ganesh Immersion 2022: వినాయక నిమజ్జనంపై వివాదం.. సద్ది కట్టుకుని హిందువులు ట్యాంక్ బండ్ రావాలని సంజయ్ పిలుపు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook