తహశీల్దార్ విజయా రెడ్డి హత్య కేసులో పోలీసుల కస్టడీలో నిందితుడు
తహశీల్దార్ విజయా రెడ్డి హత్య కేసులో పోలీసుల కస్టడీలో నిందితుడు
హైదరాబాద్: తహశీల్దార్ విజయా రెడ్డి హత్య కేసులో ప్రస్తుతం నిందితుడు గౌరెల్లికి చెందిన కూర సురేష్ పోలీస్ కస్టడీలోనే ఉన్నాడని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఈ ఘటనలో 60 శాతానికి పైగా గాయాలతో బయటపడిన సురేష్‌కు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. సురేష్‌పై హత్య, హత్యాయత్నం కేసులు నమోదు చేస్తామన్నారు.
అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఘటనాస్థలాన్ని పరిశీలించిన అనంతరం సీపీ మహేష్ భగవత్ మీడియాతో మాట్లాడుతూ.. బాచారాంలోని తన 7 ఎకరాల భూవివాదం వ్యవహారంలో హత్య జరిగినట్లు అనుమానం వ్యక్తంచేశారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ త్వరితగతిన పూర్తయ్యేలా చూస్తామని సీపీ స్పష్టంచేశారు. ఈ దాడికి దారితీసిన పరిస్థితులు, వాటి వెనుకున్న కారణాలు ఏంటనే విషయం దర్యాప్తులోనే తేలుతుందని సీపీ పేర్కొన్నారు.