హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఉల్లంఘించి ఈ నిబంధనలను ధిక్కరించే వారిపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశించారు. సిద్దిపేటలో లాక్‌ డౌన్ పరిస్థితులను వీధి వీధి తిరుగుతూ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. అంతేకాకుండా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేసే వాహనాలను హరీష్ ప్రారంభించారు. స్వీయ నియంత్రణతోనే కరోనాను అరికట్టవచ్చని, కరోనా నియంత్రణకు సీఎం కేసీఅర్  కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని హరీష్ రావు కొనియాడారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read:  త్వరలో పదో తరగతి కొత్త షెడ్యూల్...


 కరోనా ప్రభావంతో ప్రతి రోజు కష్టపడితేనే తినడానికి సరుకులు తెచ్చుకునే సిద్ధిపేట ఆటో కార్మికులకు మంత్రి హరీష్ రావు అండగా నిలిచారు. గత 15 రోజులుగా కరోనా వ్యాధి వ్యాప్తిపై రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధింపు నేపథ్యంలో రోజు కష్టపడితేనే పూట గడవని ఆటోవాలాలను ఆదుకునేందుకు మంత్రి హరీశ్ ముందుకొచ్చారు.


Read Also: WhatsApp banking: వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్ సేవలు


 జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని ఎక్స్ ప్రెస్ బస్ స్టాండ్ ఆవరణలో 700 మంది ఆటో కార్మికులకు మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి సీఏం కేసీఆర్ 12కిలోల బియ్యం అందిస్తున్నారని, వారికి ఉప్పు, పప్పులు, చింత పండు తదితర రూ.1250 విలువ కలిగిన నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ


బుల్లితెర భామ టాప్ Bikini Photos