తెలంగాణ-2024 లక్ష్యాలివే..!
తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఆరేళ్ళలో రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు వేసి.. ఎలాంటి పథకాలకు రూపకల్పన చేయాలన్న అంశం మీద చర్చిస్తూ.. తెలంగాణ 2024 పేరుతో ఓ డాక్యుమెంట్ తయారు చేయడానికి సంకల్పించింది.
తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఆరేళ్ళలో రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు వేసి.. ఎలాంటి పథకాలకు రూపకల్పన చేయాలన్న అంశం మీద చర్చిస్తూ.. తెలంగాణ 2024 పేరుతో ఓ డాక్యుమెంట్ తయారు చేయడానికి సంకల్పించింది. ఈ డాక్యుమెంట్ తయారుచేసే బాధ్యతను ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మకు ప్రభుత్వం అందించింది. ఈ డాక్యుమెంట్ లక్ష్యాలివే అని విశ్వసనీయ వర్గాల నుండి అందిన సమాచారం.
*వ్యవసాయ అభివృద్ధికి టెక్నాలజీ వినియోగం గురించి పూర్తిస్థాయిలో ప్రణాళికను తయారుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది
*ఎస్సీ, ఎస్టీలకు సబ్‌ప్లాన్ అమలుచేసిన తర్వాత.. బీసీల సమగ్రాభివృద్ధికి పక్కా ప్రణాళిక రూపొందించడం కూడా అవసరమే అన్నది టీసర్కార్ యోచన.
* ఎంబీసీల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం వారి సమగ్రఅభివృద్ధికి దోహదపడే పథకాలకు పెద్దపీట వేయాలని కూడా చూస్తోంది.
*తెలంగాణ నగరాల్లో స్కైవే, ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణంతో పాటు రోడ్లను, రహదారులను ఆధునీకరించే దిశగా ఆలోచనలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది
*పట్టణాల్లో పేదరిక నిర్మూలనకు ఏర్పాట్లు చేయడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలన్నది తెలంగాణ ప్రభుత్వ ఆలోచన
*రాష్ట్రంలో 90 శాతం అక్షరాస్యత సాధించాలన్నది కూడా తెలంగాణ 2024 డాక్యుమెంట్‌లో ప్రధాన లక్ష్యమని తెలుస్తోంది
*సర్కారీ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి ఏం చేయాలన్నది కూడా డాక్యుమెంట్‌లో పేర్కొంటున్నట్లు తెలుస్తోంది