Telangana Exit Polls 2023: దేశంలో మిజోరాం మినహా మిగిలిన రాష్ట్రాల కౌంటింగ్ మరో 24 గంటల్లో జరగనుంది. దాదాపు అన్ని సంస్థలు నవంబర్ 30వ తేదీ సాయంత్రమే ఎగ్జిట్ పోల్స్ వెలువరించగా ఇండియా టుడే సంస్థ తాజాగా ఫలితాలు ప్రకటించింది. గతంలో ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ చాలావరకూ నిజం కావడంతో ఈసారి అంచనాలు పెరిగాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రీ పోల్ సర్వేకు, ఎగ్జిట్ పోల్ సర్వేకు చాలా వరకూ తేడా ఉంటుంది. ఎగ్జిట్ పోల్ సర్వేలు కాస్త వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. పోలింగ్ ట్రెండ్‌ను బట్టి అంచనా వేస్తారు. 2018 ఎన్నికల సమయంలో ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ నిజమైన పరిస్థితి ఉంది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకు 79-91 సీట్లు వస్తాయని తెలిపింది. ఈ అంచనాలకు తగ్గట్టే బీఆర్ఎస్ 88 సీట్లతో విజయం సాధించింది. ఈసారి ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 63-73 స్థానాలు గెల్చుకుని అధికారంలో వస్తుందని వెల్లడించింది. 


ఇండియా టుడే ప్రకారం


ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీఆర్ఎస్ 34-44 స్థానాలకే పరిమితం కానుంది. ఇక కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుని 63-73 స్థానాలతో అధికారంలో రానుంది. బీజేపీ 4-8 స్థానాల్లో, ఇతరులు 5-8 స్థానాల్లో విజయం సాధించనున్నారు. 


సీఎన్ఎన్ ఐబీఎన్ ప్రకారం


సీఎన్ఎన్ ఐబీఎన్ ప్రకటించిన ఫలితాల ప్రకారం బీఆర్ఎస్ పార్టీకు 35-40 స్థానాలు మాత్రమే దక్కనున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం 65-70 స్థానాలు గెల్చుకోనుంది. ఇక బీజేపీ 7-10 స్థానాల్లో, మజ్లిస్ పార్టీ 6-7 స్థానాల్లో విజయం సాధించనున్నాయి. 


జన్ కీ బాత్ ప్రకారం


జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీఆర్ఎస్ పార్టీ 40-55 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ 48-64 స్థానాల్లో విజయం సాధించనున్నాయి. బీజేపీ 7-13 స్థానాల్లో , మజ్లిస్ పార్టీ 4-7 స్థానాల్లో విజయం సాధించనున్నాయి. 


చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం


చాణక్య స్ట్రాటజీస్ సంస్థ వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీఆర్ఎస్ పార్టీ కేవలం 22-31 స్థానాల్లోనే విజయం సాధించనుంది. కాంగ్రెస్ పార్టీ 67-78 స్థానాల్లో గెలవనుంది. బీజేపీ 6-9 స్థానాల్లో, మజ్లిస్ పార్టీ 6-7 స్థానాలు గెల్చుకోనున్నాయి.


పీపుల్స్ పల్స్ ఎగ్టిట్ పోల్స్ ప్రకారం


పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ ప్రకారంల కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో అధికారంలో రానుంది. కాంగ్రెస్ పార్టీ ఈసారి 62-72 స్థానాల్లో, బీఆర్ఎస్ 35-46 స్థానాల్లో విజయం సాధించనున్నాయి. మజ్లిస్ పార్టీ 6-7 స్థానాల్లో, బీజేపీ 3-8 స్థానాల్లో గెలవనున్నాయి.


Also read: CM KCR: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..డిసెంబర్ 4న కేబినెట్ సమావేశం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook