తెలంగాణ అసెంబ్లీ: ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ; ప్రభుత్వ ప్రాధాన్యతలపై సుదీర్ఘ వివరణ
తెలంగాణ అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించిన గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తూ ఐదేళ్లలో ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు
తెలంగాణ అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. కొత్తగా ఎన్నికైన అభ్యర్ధులకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ ... తన ప్రగంగాన్ని కొనసాగించారు. తెలంగాణ రాష్ట్రానికి రెండో సారి అధికారం చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం రానున్న ఈ ఐదేళ్ల కాలంలో ఏ ఏ అంశాలకు ప్రాతాన్యత ఇస్తుందనే దానిపై గవర్నర్ సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. ఒకవైపు సంక్షేమ పథకాలుకు పెద్దపీట వేస్తూనే అభివృధ్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు.
గవర్నర్ ప్రసంగంలోని ప్రభుత్వం ప్రాథాన్యతలు ఇవే:-
*పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం
* ఇరిగేషన్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది
* ఉద్యోగాల కల్పనను పెద్దపీట వేస్తాం
* పారిశ్రామిక వృధ్ధికి ..ముఖ్యంగా ఐటీ అబివద్ధిపై ప్రత్యేక దష్టిసారిస్తాం
*అనినీతి నిర్మూలను కు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం
* జీఎస్టీ కలెక్షన్ విషయంలో దేశంలోననే తెలంగాణ రాష్ట్రంలో ముందు వరుసలో ఉంది
* దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పకథనాలను కొనసాగిస్తాం
* చేనేత కార్మికులకు ఏడాది పాటు పని ఉండేలా చర్యలు తీసుకుంటాం
*ఓల్ట్ సిటీలో దవాఖానాలు ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సదుపాయం కల్పిస్తాం
*సత్ఫలితాలను ఇచ్చిన మిషన్ కాకతీయను మరింత వేగంగా అమలు చేస్తాం
* దేశానికి ఆదర్శంగా నిలిచిన రైతు బంధు పథకం కొనసాగిస్తాం
* వ్యవసాయనానికి ఉచిత 24 గంటల విద్యుత్ అందిస్తున్నాం
* లోటు విద్యుత్ తో మొదలై మిగులు విద్యుత్ సాధించగల్గుతున్నాం
* బీసీల అభ్యన్నతికి మరింత మెరుగైన పథకాలు
అంతకుముందు అసెంబ్లీ భవనాకిి వచ్చిన గవర్నర్ నరసింహన్ కు సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం స్వాగతం పలికారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో టీఆర్ఎస్ రెండో సారి అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఈ మేరకు గవర్నర్ చేత తమ ప్రభుత్వ పాధాన్యతలను వివరించింది. గత రెండు రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సభ్యుల చేత స్పీకర్ పోచారం శ్రీనివాస్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ రోజు జరుగుతున్న మూడో రోజు అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ నరసింహన్ ను ఆహ్వానించారు.