వరంగల్: గత వారంలో భూపాలపల్లి బస్టాండు ప్రారంభోత్సవం సందర్భంగా స్పీకర్ మధుసూధనా చారీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హెల్మెట్ లేకుండా బైక్ నడిపారు. అయితే ఈ అంశం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్పీకర్ మధుసూధనాచారీ  హెల్మెంట్ లేకుండా బైక్ నడిపిన ఘటనపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. చట్టం అందరికీ సమానమేని ..స్పీకర్ లాంటి బాధ్యతాయుతమైన  పదవిలో ఉండి కూడా ఆయన చట్టాలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపణలు సంధిస్తున్నాయి. హెల్మెట్ లేకుండా ఆయన బైక్ నడపడం ముమ్మాటికి ట్రాఫిక్ నింబంధనలు ఉల్లంఘించడమేని వాదిస్తున్నాయి. 


స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తి ఇలా చట్టాన్ని ఉల్లంఘిస్తే ఇక సాధారణ వ్యక్తలు ఏ మేరకు అమలు చేస్తారనేది ప్రశ్నార్థకమే అవుతుందని...ఇలా జరగకుండా ఉండాలంటే సాధారణ వ్యక్తులకు విధించినట్లే ఆయనకూ జరిమానా విధించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీనిపై డీజీపీ మహేందర్ రెడ్డికి కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా స్పీకర్ ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 


ఆయన సొంత నియోజకవర్గం భూపాలపల్లిలో జరిగిన బైక్ ర్యాలీలో  స్పీకర్ మధుసూదనాచారి పాటు పాటు వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, పోలీసు అధికారులు, సిబ్బంది, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.