BANDI SANJAY ARRET: జనగామ జిల్లాలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ అయ్యారు. స్టేషన్ ఘనపూర్ సమీపంలో బస చేసిన బండి సంజయ్ ను అరెస్ట్ చేసి పోలీసులు తరలిస్తున్నారు. హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర ఆందోళన చేసిన బీజేపీ కార్యకర్తలపై హత్యా యత్నం కేసులు నమోదు చేయడానికి నిరసనగా బండి సంజయ్ దీక్షకు దిగారు. దీంతో దీక్షను భగ్నం చేసిన పోలీసులు బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ పాత్రపై రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు బీజేపీ పిలుపు ఇచ్చింది.  ప్రజాసంగ్రామ యాత్రలో బసచేసిన చోటే దీక్షకు సంజయ్ ప్లాన్ చేశారు. దీంతో బండి సంజయ్‌ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బీజేపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు బీజేపీ కార్యకర్తలు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీజేపీ నేతల అరెస్ట్ లపై పార్టీ నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు జరిపారు. బంద్ కి పిలుపు ఇచ్చే యోచనలో బీజేపీ ఉందని తెలుస్తోంది. అరెస్ట్ ల పర్వాన్ని సీరియస్ గా తీసుకుంది బీజేపీ హైకమాండ్. ఇప్పటికే బండి సంజయ్ కి ఫోన్ చేసి మాట్లాడారు పార్టీ రాష్ట్ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ చుగ్.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి