PV JAYANTHI:  భారత మాజీ ప్రధానమంత్రి, దివంగత పీవీ నరసింహరావు కేంద్రంగా మరోసారి తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. పీవీ నరసింహరావు కాంగ్రెస్ నేత అయినా తెలంగాణలో మాత్రం అధికార టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఆయన చుట్టూ రాజకీయాలు చేస్తున్నారు. గత ఏడాదే పీవీ నరసింహరావు శత జయంతి. దీంతో పీవీ శత జయంతి ఉత్సవాల పేరుతో కేసీఆర్ సర్కార్ బాగా హడావుడి చేసింది. ప్రభుత్వం తరపున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. శత జయంతి వేడుకల ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. పీవీని తెలంగాణ ముద్దుబిడ్డగా అభివర్ణించారు కేసీఆర్.  అయితే గత ఏడాది పీవీ జయంతి రోజున హంగామా చేసిన సీఎం కేసీఆర్.. ఈసారి మాత్రం సైలెంట్ అయిపోయారు. పీవీకి నివాళి కూడా అర్పించలేదు. ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ కు వెళ్లి నివాళి అర్పించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పీవీ జయంతి రోజున  సీఎం కేసీఆర్ కనీసం నివాళి కూడా అర్పించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. మంగళవారం సీఎం కేసీఆర్ రాజ్ భవన్ వెళ్లారు. కొత్త సీజే ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. రాజ్ భవన్ సమీపంలోనే పీవీ సమాధి ఉంటుంది. కాని అటువైపు వెళ్లలేదు కేసీఆర్. ఇదే ఇప్పుడు చర్చగా మారింది. పీవీని సీఎం కేసీఆర్ రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ ను సందర్శించి నివాళి అర్పించిన తర్వాత మీడియాతో మాట్లాడిన బండి.. కేసీఆర్ తీరును ఎండగట్టారు. రాజకీయ లబ్ది కోసం వాడుకుని వదిలేయడం కేసీఆర్ నైజమని అన్నారు. ఎమ్మెల్సీ, జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే గతంలో పీవీ ఛరిష్మాను కేసీఆర్ వాడుకున్నారని ఆరోపించారు. ఎన్నికలయ్యాక పీవీని పూర్తిగా విస్మరించారని.. జయంతి ఉత్సవాలకు హాజరుకాకపోవడం సిగ్గు చేటని అన్నారు,


పీవీ,  తెలుగు ఠీవీ అని వల్లించే సీఎం  కేసీఆర్ మాత్రం పీవీ జయంతి రోజున ఎందుకు నివాళి అర్పించలేదని సంజయ్ ప్రశ్నించారు. ఇప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టే పీవీ ఘాట్ కు రాలేదన్నారు. కేసీఆర్ కు రాజకీయాలే ముఖ్యమని,  ఎవడి కొంప ముంచాలన్నదే  ఆయన లక్ష్యమని విమర్శించారు. పీవీ ఘాట్ కు వంద కోట్లు ఖర్చు పెడతానన్న హామీ ఏమైందని నిలదీశారు. వీపీ శత జయంతి ఉత్సవాల్లోనూ కేసీఆర్, ఆయన కొడుకు ఫోటోలతో ఫ్లెక్సీలు వేసుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. పీవీ జన్మస్తలం వంగరను అభివ్రుద్ది చేస్తా... స్మారక కేంద్రం చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారని మండిపడ్డారు. అవసరమైతే కాళ్లు... లేదంటే జుట్టు పట్టుకునే వ్యక్తి కేసీఆర్ అన్నారు. ప్రజలంతా కేసీఆర్ తీరును చూసి సిగ్గుపడుతున్నారని చెప్పారు. పీవీ అభిమానాలు, కుటుంబ సభ్యులు కేసీఆర్ తీరును గమనించాలని అన్నారు. పీవీని కాంగ్రెస్ అవమానిస్తే.. రాజకీయంగా వాడుకుని కేసీఆర్ మరింతగా అవమానించారని బండి సంజయ్ ఆరోపించారు.


Read also: TS Inter Supplementary Exams: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పటినుంచి అంటే..


Read also:  KCR RAJBHAVAN: గవర్నర్ తో జోకులు.. కిషన్ రెడ్డితో నవ్వులు! రాజ్ భవన్ లో కేసీఆర్ సందడే సందడి..      



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి



Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.