BJP slams CM KCR over his Kukka remarks on women: నాగార్జున సాగర్ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తుండగా.. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వడానికి స్టేజీ వద్దకు వచ్చిన మహిళలపై సీఎం కేసీఆర్ దురుసుగా మాట్లాడటాన్ని బీజేపి నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. '' మీరు పట్టుమని పదిమందే ఉన్నారు.. మేం తలుచుకుంటే దుమ్ములో కలిసిపోతారు'' అని సీం కేసీఆర్ వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన BJP.. సీఎం కేసీఆర్‌కు అధికారంతో వచ్చిన అహంకారం నెత్తికెక్కిందని మండిపడుతున్నారు. అంతేకాకుండా సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన మహిళలపైకి అక్కడే ఉన్న TRS party కార్యకర్తలను ఉసిగొల్పే విధంగా CM KCR వ్యవహరించారని బీజేపి నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Nagarjuna Sagar meeting సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగంలో ఆందోళన స్పష్టంగా కనిపించింది అని బీజేపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి అన్నారు. నాగార్జున సాగర్ సభకు కేసీఆర్ వస్తున్నారని తెలుసుకున్న ఫీల్డ్ అసిస్టెంట్స్, కాంట్రాక్ట్ ఎంప్లాయిస్, గిరిజనులు తమ సమస్యలు చెప్పుకోవడానికి వస్తే.. వారిని మహిళలు అని కూడా చూడకుండా కుక్కలు (Dogs) అని సంభోదించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించిన మనోహర్ రెడ్డి.. సీఎం కేసీఆర్ అధికార మధం నెత్తికెక్కి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మాట్లాడిన మాటలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలు కాదని అన్నారు. తమ సమస్యలు చెప్పుకుందామని ప్రగతి భవన్‌కి వచ్చే వారికి సీఎం కేసీఆర్ కలిసే అవకాశం ఇవ్వకపోవడం వల్లే ఆ మహిళలు ఇలా సభా ప్రాంగణం వద్దకు వచ్చారని.. అలా తమ సమస్యలు ఏకరువు పెట్టుకుందామని వచ్చిన వారిని అంతమంది ఎదుట అగౌరపర్చి పంపించేయడం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి తగదు అని సీఎం కేసీఆర్‌కు BJP vice-president Manohar Reddy హితవు పలికారు. 


Also read : SBI: హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వారికి శుభవార్త, అప్పటివరకూ ఆ ఫీజు లేదు


టీఆర్ఎస్ చేస్తే ఒప్పు.. మరొకరు చేస్తే తప్పా ? 
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు టీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఇలాంటి నిరసనలు ఎన్నో చేశారని.. మరి అప్పుడు తప్పుగా అనిపించని ఆ పని ఇప్పుడు ప్రజలు చేస్తే ఎందుకు తప్పుగా అనిపిస్తోందని మనోహర్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. 


BJP అంటే సీఎం కేసీఆర్‌కి వణుకు..
బీజేపి అంటే సీఎం కేసీఆర్‌కు వణుకు పుడుతోందని.. అందుకే తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ లేవనెత్తిన గిరిజనుల సమస్యలపైనే సీఎం కేసీఆర్ ప్రసంగం కొనసాగిందని మనోహర్ రెడ్డి అన్నారు. Gurrampode గిరిజన భరోసా యాత్రలో బండి సంజయ్ ప్రస్తావించిన సమస్యలనే సీఎం కేసీఆర్ ప్రస్తావించడమే అందుకు నిదర్శనం అని అన్నారు. ఇన్నిరోజుల్లో ఏనాడూ పోడు భూముల సమస్యల గురించి మాట్లాడని సీఎం కేసీఆర్.. తాజాగా Bandi Sanjay ఆ సమస్యలపై దృష్టిసారించిన తర్వాత మాట్లాడారు. బీజేపి అంటే CM KCR లో వణుకు మొదలైందంటానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలని మనోహర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.


Also read : GHMC Mayor Election 2021: జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికలు, అన్ని పార్టీల కార్పొరేటర్లను వెంటాడుతున్న భయం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook